Solar Eclipse : సూర్య గ్రహణం వెనుక దాగిన కథనాలు.. తప్పక తెలుసుకోండి..!

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Solar Eclipse : సూర్య గ్రహణం వెనుక దాగిన కథనాలు.. తప్పక తెలుసుకోండి..!
New Update

Solar Eclipse Story : తల పైకెత్తి చూస్తే నేనున్నాననే భరోసాతో మనకి ఆకాశం కనిపిస్తుంది.. ఆ ఆకాశం అనంత అద్భుతాలకు నిలయం.. అంతరిక్షం(Space), గ్రహాలు, నక్షత్రాలు లాంటివాటిపై మానవుడి ఆసక్తి ఈనాటిది కాదు. ఈ విశ్వం గుట్టు విప్పేందుకు ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలనే పణంగా పెట్టారు. అంతుచిక్కని విశ్వం రహస్యాలను ఛేదించేందు సైంటిస్టులు తమ మెదళ్లకు సాన పెడితే మరోవైపు మతం ప్రతీ అద్భుతాన్ని దేవుడికి అంకితం చేసింది. ఇలా సైన్సు, మతం మధ్య ఉన్న వైరం వేల ఏళ్ల నాటిది. ఈ యుద్ధం గ్రహనాల సమయంలో బయటపడుతుంది.

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం(Solar Eclipse) ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

సూర్య గ్రహణం అంటే?

సూర్యుడు(Sun), చంద్రుడు(Moon), భూమి ఒకే సరళరేఖ(Straight Line) పైకి వచ్చినప్పుడు సూర్య గ్రహణం సంభవిస్తుంది. అంటే సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వస్తాడు. ఆ సమయంలో సూర్యుడు భూమిపై ఉన్నవారికి కనిపించడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని అడ్డుకునే భాగం ఆధారంగా పాక్షిక సూర్య గ్రహణం, సంపూర్ణ సూర్య గ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతాయి. రింగ్ ఆఫ్ ఫైర్ 5 నిమిషాల పాటు కనిపిస్తుంది.

Solar Eclipse

సంప్రదాయవాదులు ఏం చెబుతారు?

రాహువు, కేతువు అనే గ్రహాలు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయడం వలన గ్రహణాలు ఏర్పడతాయన్నది కొందరి సంప్రదాయవాదుల వాదన. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుందని నమ్మేవారు ఉన్నారు. ఈ సమయంలో గర్భిణిలకు చాలా నియమాలను చెబుతుంటారు. గ్రహణం వేళ భోజనం చేయకూడదన్నది చాలా మంది చెప్పే మాట. గ్రహణం చూస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో బయటకి రారు.

హేతువాదులు ఏం చెబుతారు?

సూర్యుడు చంద్రుడు భూమి ఒకదాని చట్టూ ఒకటి తిరిగే క్రమంలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడతాయని హేతువాదులు పదేపదే చెబుతుంటారు. నిజానికి గ్రహణం వల్ల ఎలాంటి అనర్థాలు, అద్భుతాలు జరగవన్నది సైన్స్ మాట. అందుకే గ్రహణం రోజు హేతువాదులు బహిరంగంగా భోజనం చేస్తుంటారు. గ్రహణాలు సర్వసాధారణమని ..వాటి వల్ల ఎలాంటి కీడు జరగదని చెప్పే ఉద్దేశ్యమే ఇది. ఇలా గ్రహణానికి మతం, సైన్స్ ఎవరి వాదన వారు వినిపించుకుంటున్నారు. ఇక వీటితో సంబంధం లేని ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది.

Also Read : Jr NTR: RTO కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసమే వెళ్లారట..?

#moon #sun #solar-eclipse
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe