Election Commission: కొత్త టోల్‌ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్‌!

లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Election Commission: కొత్త టోల్‌ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్‌!
New Update

వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాత ఛార్జీలనే వసూలు చేయాలని టోల్‌ ఆపరేటర్లకు ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.

దేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 1న టోల్‌ ఛార్జీల పెంపు జరుగుతుంది. ఇలా పెంచిన టోల్ ట్యాక్స్​ సగటున 5 శాతం వరకు ఉంటుంది. ఈ ఏడాది కూడా పెరిగిన టోల్‌ ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఈసీ సూచించింది. దీనితో ఏప్రిల్​ 1 నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి ఇచ్చేయనున్నట్లు NHAI వర్గాలు తెలిపాయి. ​

దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడతాయి. అయితే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో వెంటనే టోల్ ట్యాక్స్​ పెంపు అమల్లోకి వస్తుందా? లేదా సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయ్యే వరకూ పాత ఛార్జీలే కొనసాగుతాయా అనే విషయంలో స్పష్టత లేదు.

Also read:  హీరోయిన్లకు కేటీఆర్‌ బెదిరింపులు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యాలు!

#elections #charges #tollfree
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe