Election Commission: కొత్త టోల్ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్! లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 02 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాత ఛార్జీలనే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. దేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న టోల్ ఛార్జీల పెంపు జరుగుతుంది. ఇలా పెంచిన టోల్ ట్యాక్స్ సగటున 5 శాతం వరకు ఉంటుంది. ఈ ఏడాది కూడా పెరిగిన టోల్ ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఈసీ సూచించింది. దీనితో ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి ఇచ్చేయనున్నట్లు NHAI వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. అయితే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో వెంటనే టోల్ ట్యాక్స్ పెంపు అమల్లోకి వస్తుందా? లేదా సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయ్యే వరకూ పాత ఛార్జీలే కొనసాగుతాయా అనే విషయంలో స్పష్టత లేదు. Also read: హీరోయిన్లకు కేటీఆర్ బెదిరింపులు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యాలు! #elections #charges #tollfree మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి