Sreesanth vs Gambhir: 'పదేపదే అలా పిలిచాడు..' శ్రీశాంత్ వర్సెస్ గంభీర్ గొడవ.. మధ్యలో భువనేశ్వరి! లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్ వర్సెస్ గంభీర్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనను గంభీర్ ఫిక్సర్ అని పిలిచాడని శ్రీశాంత్ ఆరోపించగా.. తాజాగా అతని భార్య భువనేశ్వరి గంభీర్ ప్రవర్తనను తప్పుపట్టారు. By Trinath 07 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి గంభీర్(Gambhir), శ్రీశాంత్(Sreesanth).. తన్నుకోవడంలో ఇద్దరూ తక్కువేం కాదు. కయ్యానికి కాలు దువ్వడానికి అసలు వెనకాడరు. గంభీర్ అయితే ఎంత మాటైనా ముఖంపైనే అనేస్తాడు. ఇటు శ్రీశాంత్ సైతం ఇండియాకు క్రికెట్ ఆడిన రోజుల్లో అత్యంత వివాదాస్పదుడు. ఐపీఎల్లో ఓ సారి అతి చేశాడని హర్భజన్‌సింగ్ అతడిని చెంపదెబ్బ కూడా కొట్టాడు. ఇక ప్రత్యర్థి ఆటగాళ్లతోనూ పలుసార్లు దురుసుగా ప్రవర్తించాడు శ్రీశాంత్. ఇటు గంభీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా క్రికెటర్లతో పలుసార్లు గ్రౌండ్లో గొడవపెట్టుకున్న గంభీర్.. ఐపీఎల్లో రెండుసార్లు కోహ్లీపై వాగ్వాదానికి దిగాడు. ఇలా నిత్యం గొడవలతో ప్రత్యర్థులపై కస్సుబుస్సుమనే శ్రీశాంత్, గంభీర్ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే ఏకంగా శ్రీశాంత్ భార్య గంభీర్‌పై విమర్శలు గుప్పించేంతలా. ఇంతకి ఏం జరిగింది? అసలేం జరిగిందంటే? సూరత్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇండియన్ క్యాపిటల్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ పోరులో మాజీ సహచరులు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్ ఒక ఫోర్, మరో సిక్సర్ బాదాడు. దీంతో గంభీర్‌వైపు శ్రీశాంత్ కోపంగా చూశాడు. ఇక్కడవరకు స్క్రీన్‌పై కనపడింది. ఆ తర్వాత తనను గంభీర్ పదేపదే ఫిక్సర్ అని పిలిచాడని శ్రీశాంత్ ఆరోపిస్తున్నాడు. మ్యాచ్ సమయంలో జరిగిన గొడవకు గంభీర్ వ్యాఖ్యలే కారణమని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు.'ఇక్కడ నా తప్పేమీ లేదు. నేను వెంటనే గాలిని క్లియర్ చేయాలనుకున్నాను. మిస్టర్ గౌతీ ఏం చేసాడో, త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది. క్రికెట్లో అతను ఉపయోగించిన పదాలు మరియు అతను చెప్పిన విషయాలు. ఫీల్డ్, లైవ్, ఆమోదయోగ్యం కాదు..' అని కామెంట్ చేశాడు. శ్రీశాంత్ భార్య ఎంట్రీ: ఇక ఈ వివాదంపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తాజాగా స్పందించారు. 'చాలా సంవత్సరాలుగా తనతో కలిసి భారతదేశం తరపున ఆడిన ఆటగాడు ఈ స్థాయికి దిగజారాడని శ్రీశాంత్ నుంచి వినడం చాలా షాకింగ్‌గా ఉంది. యాక్టివ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్న చాలా సంవత్సరాల తర్వాత కూడా. ఈ రకమైన ప్రవర్తన షాకింగ్, ఇది నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది' అని భువనేశ్వరి శ్రీశాంత్ పోస్ట్‌లోని కామెంట్ విభాగంలో పేర్కొంది. Also Read: వైరల్‌గా మారిన వందేళ్ల చెట్టు…అందానికి నెటిజన్ల ఫిదా #sreesanth #cricket #gambhir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి