Thyroid Problem Tips: ఈ చిట్కాలు పాటిస్తే థైరాయిడ్‌ తగ్గుతుంది

చాలా మంది థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని ఇంటి చిట్కాలతో థైరాయిడ్‌ తగ్గించుకోవచ్చు. యోగా, ప్రాణాయామంతో పాటు మునగాకు తింటే మంచి ఫలితం ఉంటుంది. శొంఠి కూడా థైరాయిడ్‌ తగ్గిస్తుంది.

New Update
Thyroid Problem Tips: ఈ చిట్కాలు పాటిస్తే థైరాయిడ్‌ తగ్గుతుంది

Thyroid Problem Tips: చాలా మంది థైరాయిడ్‌ (thyroid) కారణంగా బరువు పెరుగుతూ ఉంటారు. మరికొందరు థైరాయిడ్‌ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతుంటారు. మన శరీరం హార్మోన్ల ప్రభావంతోనే పనిచేస్తూ ఉంటుంది. గొంతు భాగంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో తేడాలు ఉన్నప్పుడు థైరాయిడ్‌ వస్తుంది. థైరాయిడ్‌ అనేది రెండు రకాలు. అందులో ముఖ్యమైనది హైపో థైరాయిడిజం (Hypothyroidism). ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డాక్టర్‌ (Doctors)లు ఇచ్చిన మందులతో పాటు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు

ఈ హైపో థైరాయిడిజం వలన నీర‌సం, మాన‌సికంగా కుంగడం, బరువు బాగా పెరగడం, చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం, ఎక్కువగా నిద్రతో పాటు జుట్టు రాలడం, కండరాల నొప్పులు, చర్మం పొడిబారిపోవడం, ఏకాగ్రత ఉండకపోవడం జరుగుతూ ఉంటాయి. హైపో థైరాయిడిజం అనేది ఆటో ఇమ్యూన్ స‌మ‌స్య. అయోడిన్‌ తక్కువగా ఉండటం, ఒత్తిడి (stress), జీవనశైలి వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు క్యాబేజీ (Cabbage), క్యాలీ ఫ్లవర్‌, ముల్లంగి, పాలకూర (Lettuce), సోయా, బెర్రీస్‌ తినకూడదు. యోగా (yoga), ప్రాణాయామం (Pranayama) వల్ల కూడా థైరాయిడ్‌ను తగ్గించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: రంగు మారిన కాఫీ.. రుచిలో బాప్.. స్కిన్ కేర్‌కి టాప్

హైపో థైరాయిడిజానికి మునగ ఆకు (Beetroot leaf) బాగా పనిచేస్తుంది. ఈ ఆకుతో పప్పు లేదా పచ్చడి చేసుకుని రోజూ తినాలి. నీళ్లలో కొన్ని మునగాకులను వేసుకుని కషాయం చేసుకుని తాగినా గ్రంథి తీరు మెరుగుపడుతుంది. శొంఠిని నెయ్యిలో వేపిన తర్వాత పొడిలా చేసుకుని భోజనం చేసేప్పుడు అన్నంలో అరచెంచా వేసుకుని తింటే మంచిది. శొంఠి కషాయం తాగినా థైరాయిడ్‌ (thyroid) సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

ఇది కూడా చదవండి: మీ పిల్లలు చదువులో రాణించాలంటే పల్లీపట్టీలుఇవ్వండి

Advertisment
Advertisment
తాజా కథనాలు