Heart Attack: ఈ ఆహారం తింటే గుండెపోటు అస్సలు రాదు

గుండెపోటు వస్తే జీవనశైలితోపాటు ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఇంతకుముందు గుండెకు చికిత్స పొందినట్లయితే.. ఆవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం ఎక్కవగా తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Heart Attack

Heart Attack

New Update

Heart Attack: ఒక్కసారి గుండెపోటు వస్తే జీవనశైలి మొత్తం మారిపోతుంది. ఇలాంటి సమయంలో ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార నియమాలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఎవరికైనా ఒకసారి గుండెపోటు వస్తే మళ్లీ గుండెపోటు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం ఒకటే మార్గం. మన ఆహారపు అలవాట్లు శరీర బరువు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు,  రక్తంలో చక్కెర స్థాయిలు గుండెపోటు వచ్చేందుకు అవకాశం కల్పిస్తాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే, ఇంతకుముందు గుండెకు చికిత్స పొందినట్లయితే ఆహారం నియమాలు పాటించడం వల్ల గుండెపోటును నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె రోగులకు ఆరోగ్యం మెరుగుపరచడానికి చాలా ఆహార ఎంపికలు ఉంటాయి. గుండె  ఆరోగ్య కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది:

ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. దీంతోపాటు తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండెకు చాలా మంచిది. ఆవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం ఇలాంటివి బాగా తినాలి. ఇవి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బ్రౌన్ రైస్, ఫినోవా లాంటివి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాలను నియంత్రిస్తాయి. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..?

ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్రోకలీ, క్యారెట్లు, ఆకుకూరలు మేలు చేస్తాయి. కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. అధిక కొవ్వు ఉన్న వాటికంటే తక్కువ ఉన్న పాల ఉత్పత్తులు తినడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పెరుగు, చీజ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండెజబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్లు ఉప్పు తక్కువగా తినాలి. ఉప్పు తక్కువగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రక్త పోటు కూడా తగ్గుతుంది. కాబట్టి ఉప్పు బదులు మూలికలు, సుగంధ ద్రవ్యాలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  ఈ లక్షణాలు ఉంటే అది మానసిక సమస్యే

#heart-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe