Marigold: పువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీటిని ప్రతి పూజలో, పండగ సమయంలో, ఇతర కార్యక్రమాలలో వీటిని వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు మనకు అనేక రకాల పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్‌లో సమస్యలు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు సీజన్‌తో పాటు కొన్నిటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. వాటిల్లో బంతి పువ్వు ఒకటి. ఇది చూడటానికి అందంగా, ఎర్ర, తెల్లటి రంగుల్లో కనిపిస్తుంది. కానీ దీనివల్ల అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు కొందరికి ఈ పువ్వులు పడవు. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, తుమ్ములు వచ్చే అవకాశం కూడా ఉంది. ముక్కు కారడం, కళ్ళు ఎర్రగవ్వడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వాసనలు, మొక్కల ఆకులు, ఆహారాలు, పూల అణువులు ఇలాంటివి కూడా అలెర్జీలకు కారణం అవుతాయి. అయితే ఈ ఎర్రటి బంతి పువ్వు కూడా అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. గాలిలో ఈ పువ్వు అణువులు ఎక్కువగా ఉన్నందున తుమ్ములు, జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇంట్లో ఈ చెట్లను పెంచుకునే వారికి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే అలెర్జీ బాధితులు ఎవరైనా ఉంటే.. ఈ చెట్లకు దూరంగా ఉండాలి.
పెద్దలే కాదు చిన్న పిల్లలకు కూడా ఈ పూలు దూరంగా ఉంచితే మంచిది. ఎందుకంటే శిశువుకు శ్వాస తీవ్రమై అలెర్జీ సమస్యలను కలిగించే గుణాలు ఈ పువ్వుకు ఉన్నది. ఓ సర్వే ప్రకారం ప్రతి పువ్వులో అస్తమా, శ్వాస సమస్యలు కలిగించే అణువులు ఉంటాయని, అందువల్ల అలెర్జీలు ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిదని నిపుణలు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: శరీరంలో చెడు కొవ్వు ఉంటే డిమెన్షియా పెరుగుతుందా..?