Jobs: పవర్‎గ్రిడ్‎లో 203పోస్టులకు రిక్రూట్‎మెంట్...ఇలా అప్లయ్ చేసుకోండి...!!

నిరుద్యోగులకు శుభవార్త. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 203 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 12న ముగుస్తుంది.

Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు
New Update

నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను షురూ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీసీఐఎల్ (PGCIL)అధికారిక వెబ్ సైట్ powergrid.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభం అయ్యింది. డిసెంబర్ 12న ముగుస్తుందని పేర్కొంది.

ఇక ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియలో మొత్తం 203 పోస్టులను భర్తీ చేయనుంది. సీబీటీ పరీక్ష జనవరి 2024లో నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ పోస్టులపై ఉద్యోగం పొందాలని ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఈ క్రింద పేర్కొన్న పాయింట్లను జాగ్రత్తగా చదవండి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదలైన తేదీ : నవంబర్ 22

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం తేది : నవంబర్ 22

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : డిసెంబర్ 12

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : డిసెంబర్ 12

అర్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్ స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ఐటీఐతో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుత సాధించింది ఉండాలి.

వయోపరిమితి:

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గరిష్టంగా 27ఏళ్లు మించి ఉండకూడదు.

దరఖాస్తు రుసుము:

అన్ని అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూ డీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

ఇది కూడా చదవండి: గూగుల్ పే వాడే వారికి షాక్..!!

#jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe