Summer: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 దాటిన తరువాత ప్రజలు బయటకు రావాలంటే హడలి పోతున్నారు. 10 గంటల లోపే 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వాతావరణశాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్రమైన వడగాల్పులతో పాటు, ఎండల హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 10 దాటిన తరువాత ప్రజలను బయటకు రావొద్దని సూచించింది.
వడగాల్పులు తీవ్రంగా ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ- గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే సూర్యాపేట, కొత్తగూడెం, నల్గొండలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శనివారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
కొన్ని మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు 6.1 డిగ్రీలు అదనంగా నమోదు అవుతున్నట్లు అధికారులు వివరించారు. రోజులో అత్యధికంగా 42. 8 డిగ్రీల ఎండ కాస్తుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులకు ఇద్దరు చనిపోయారు.
Also read: ”అల్లు” వారి విల్లు… నట మత్స్య యంత్రాన్ని చేధించిన ”అర్జును”డికి హ్యాపీ బర్త్ డే!