Prabhas: ఆ హీరో మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్..!!

'కన్నప్ప' మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారని ఫాన్స్ హాల్ చల్ చేస్తున్నారు. మంచు విష్ణు సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నారు. 'కన్నప్ప'గా మంచు విష్ణు కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతుండగా.. మహాశివుడిగా ప్రభాస్ ఉండనున్నారని టాక్‌ వినిపిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

New Update
Prabhas: ఆ హీరో మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్..!!

Prabhas in Kannappa Movie: 'కన్నప్ప' మూవీలో మహాశివుడిగా రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కనిపించనున్నారని ప్రభాస్‌ ఫాన్స్ హాల్ చల్ చేస్తున్నారు. మంచు విష్ణు(Manchu Vishnu) సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నారు. 'కన్నప్ప'గా మంచు విష్ణు కనిపించనున్నారు.అయితే, ఇంతవరకూ మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలలో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుండటం విశేషంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతుండగా.. మహాశివుడిగా ప్రభాస్ ఉండనున్నారని టాక్‌ వినిపిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

publive-image

'కన్నప్ప' మూవీలో మంచు విష్ణు - ప్రభాస్ కాంబినేషన్ లోని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. 'బాహుబలి' (Baahubali) లో జానపదులతో 'శివుడు'గా పిలిపించుకున్న ప్రభాస్, ఇప్పుడు మహాశివుడిగా కనిపించనున్నాడంటే ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అవుతున్నారు. మంచు విష్ణు మూవీలో ప్రభాస్ మహాశివుడిగా  పోషిస్తున్నారని టాక్ వినిపిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు. 'కన్నప్ప' శక్తిని పరీక్షించడం .. అర్జునుడిగా కన్నప్ప ఉన్నప్పుడు అతనితో బోయవాడిగా శివుడు తలపడటం .. 'కన్నప్ప' పస్తులుంటే అతని కోసం శివుడు మారువేషంలో వచ్చి బ్రతిమాలటం .. కన్నప్ప అజ్ఞానాన్ని తొలగిస్తూ అతనికి సాక్షాత్కారం ఇవ్వడం .. ఇలాంటి సన్నివేశాలన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాయని తెలుస్తోంది.

publive-image

రెబల్ స్టార్ ప్రభాస్ ..నటుడు మోహన్ లాల్ (Mohan Lal) .. శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో కనిపించనున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే  ముఖ్యంగా  ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నారో అని అందరిలోనూ క్యూరియాసిటి రేకెత్తిస్తోంది. అయితే, ఈ సినిమా లో ఆయన మహాశివుడి పాత్రలో కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ పాత్రకి ఆయన కరెక్టుగా సెట్ అవుతాడనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Also Read: అక్కడ ఆడిషన్స్ కు వెళ్తున్న మంచు లక్ష్మి..!!

Advertisment
తాజా కథనాలు