Krishnam Raju: కృష్ణం రాజు బర్త్ డే స్పెషల్! ఇవాళ (జనవరి 20) టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కృష్ణంరాజును మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. సినిమా రంగానికి రెబల్ స్టార్ అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. By Archana 20 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishnam Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఒకరు కృష్ణంరాజు. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ చిత్రాలతో కృష్ణంరాజు రెబల్ స్టార్‌గా అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నారు . యాభై ఏళ్ల సినీ జీవితంలో 183 చిత్రాలకు పైగా నటించారు. తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న కృష్ణం రాజు పుట్టిన రోజు నేడు. సినీ జీవితం కృష్ణం రాజు 1966లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో చిలక గోరింక సినిమాతో నటుడిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టారు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత 1974 లో భక్త కన్నప్ప సినిమా భారీ విజయాన్ని సాధించడంతో గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న, అమర ద్వీపం, జైలర్ గారి అబ్బాయి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నిర్మాతగా కృష్ణంరాజు గోపికృష్ణ పతాకంపై ఎన్నో సినిమాలు నిర్మించారు. చివరిగా కృష్ణం రాజు కొడుకు ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో కనిపించారు. అవార్డ్స్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ జీవితంలో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ ఆయన సొంతమయ్యాయి. అమర ద్వీపం సినిమాకు తొలి నంది అవార్డు తొలి నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత బొబ్బొలి బ్రహ్మన్న చిత్రానికి రెండో నది అవార్డు ఆయన సొంతమైంది. నటుడిగా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవార్డులను అందుకున్న గొప్ప నటుడు కృష్ణంరాజు. జైలర్ గారి అబ్బాయి చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. Also Read: Ranbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్ వ్యక్తిగత జీవితం ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20 న మొగల్తూరు లో జన్మించారు. కృష్ణంరాజు వారసుడిగా హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ చిత్రాలతో గొప్ప నటుడిగా సాగుతున్నారు. సినీ రంగంలోనే మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా గొప్పగా రాణించారు కృష్ణంరాజు. 1990 లో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా తన సేవలను అందించారు. చిత్ర సీమలో చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న అనారోగ్యంతో మరణించారు. Also Read: Pushpa 2 OTT Release: ఆ OTT సంస్థతో ఒప్పందం ఫిక్స్.. Pushpa-2 నుంచి అదిరే అప్డేట్ #krishnam-raju-birthday-special మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి