Kishan Reddy: నేను పోటీ చేయకపోవడానికి కారణం ఇదే.. కాళేశ్వరంపై సీబీఐ.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TS: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం చెప్పినందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. హరీష్ రావుపై బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతామని.. ఈ నెల 12 లేదా 13న తమ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు.

New Update
Kishan Reddy: నేను పోటీ చేయకపోవడానికి కారణం ఇదే.. కాళేశ్వరంపై సీబీఐ.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

BJP Vs BRS: తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యహరిస్తోంది. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటన్న సంగతి తెలిసిందే. నిన్న(శనివారం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కిషన్ రెడ్డి(Kishan Reddy) భేటీ అయ్యారు.. ఈ భేటీలో తెలంగాణలో 10 స్థానాల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్‌.. ఆ 3 స్థానాలపై నేతల మధ్య యుద్ధం!

తాజాగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగ నియామకాల్లో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. 10 ఏళ్లుగా ఒక్క టీచర్‌ పోస్టు కూడా సీఎం కేసీఆర్ భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ వచ్చిందో దానికి విరుద్ధంగా BRS పాలన ఉందని విమర్శించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని.. కొత్త సచివాలయానికి కూడా కేసీఆర్‌ రావడం లేదని, కేసీఆర్‌ నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఫైర్ అయ్యారు.

ఇవాళ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.." జాతీయ పార్టీ ఆదేశాల మేరకే తాను పోటీకి దూరంగా ఉన్నా. మూడు సార్లు అసెంబ్లి ఎన్నికల్లో ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్‌ఎస్ అభ్యర్థిని ఓడించాను. బీసీలు అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఈరోజు రాత్రి మీగతా సీట్లు ఫైనల్ అవుతాయి. జనసేన NDA లో బాగస్వామి అందుకే వారితో పొత్తుకు వెళ్తున్నాం. జనసేన తో రెండు సీట్ల మీద పంచాయతీ జరుగుతుందని అవాస్తవం. కేసిఆర్‌కి నేనెందుకు ఫేవర్ ఉంటా?. నేను నా పార్టీకి కట్టుబడి ఉంటాను తప్ప ఎవరికీ ఫేవర్‌గా ఉండాల్సిన అవసరం లేదు. సోనియా గాంధీ, రాహూల్ గాంధీనీ సైతం ఈడీ ఎన్నోసార్లు విచారణ జరిపింది. వాళ్లు అరెస్ట్ కాలేదు కదా అలాగని సోనియా గాంధీ కుటుంబంతో కుమ్ముకు అయ్యమా?. సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్స్ ఒక్కటేనా?. రేవంత్ రెడ్డి దీన్ని ఒప్పుకుంటారా?. కవితపై ఎంక్వైరీ జరుగుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయి." అని అన్నారు.

Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు ఎంతో తెలుసా?

పార్టీ మారే వాళ్లు వారి స్వంత ప్రయోజనాల పార్టీ మారుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. బీఅర్‌ఎస్‌కి బీజేపీ ఆల్టర్నేటివ్ కాదని ఒక వ్యక్తి చెప్తే కాదు కదా?.. బీఅర్‌ఎస్‌కి ఎవరు ప్రత్యామ్నాయం అనేది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ రావుపై స్ట్రాంగ్ అభ్యర్థిని పోటీలో దింపుతామని చెప్పారు. అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా తర్వాత మేనిఫెస్టో విడుదల చేసే సంప్రదాయం మా పార్టీలో ఉందని.. ఈ నెల 12 లేదా 13న మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు