Temple: ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. గుడికి ఎందుకు వెళ్లాలంటే?

భారతదేశంలో గుళ్ళు, గోపురాలు దర్శించుకోవడం ఎన్నో తరలుగా వస్తున్న సంప్రాదాయం. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా..? గుడికి వెళ్లడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక,శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Temple: ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. గుడికి ఎందుకు వెళ్లాలంటే?

Temple: భారతదేశంలో గుడికి వెళ్లడం, దేవుళ్ళకు మొక్కు బడులు చెల్లించుకోవడం అనాది నుంచి వస్తున్న సంప్రాదాయం. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు గుళ్ళు, గోపురాలు తిరుగుతూ దేవుళ్లను దర్శించుకుంటారు. కొందరు మనసు ప్రశాంతత కోసం గుడికి వెళ్తే.. మరికొందరు దేవుడు తమ కష్టాలను తీరుస్తాడనే నమ్మకంతో వెళ్తారు. ప్రశాంతత, మొక్కుల కోసం కాకుండా.. అసలు గుడికి వెళ్లడం వెనుక కారమేంటని ఎప్పుడైనా ఆలోచించారా..? అవేంటో ఇప్పుడు తెలుసుకోండి...

పవిత్రమైన వాతావరణం

హిందూ దేవాలయాలు పవిత్రమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడతాయి. అందంగా చెక్కిన శిల్పాలు, అలంకరణలు, దూప, దీప నైవేద్యాలు మనసును నిర్మలంగా ఉంచడంతో పాటు ప్రశాంతతను కలిగిస్తాయి.

పాజిటివ్ ఎనర్జీ

సాధారణంగా భూమిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరించే స్థలంలో దేవాలయాలను నిర్మిస్తారు. అందుకే ఆలయంలో అడుగు పెట్టగానే తనువు, మనసు ఎంతో ప్రశాంతతను పొందుతాయి. గుడిలోని పాజిటివ్ ఎనర్జీ మనల్ని కూడా ఆకర్షిస్తుంది.

Also Read: Operation Valentine Trailer: “ఏం జరిగిన చూస్కుందాం” .. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్

సాంస్కృతిక ప్రాముఖ్యత

భారత దేశంలోని దేవాలయాలు గొప్ప చరిత్ర,సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ పురాతన ఆలయాలను సందర్శించడం ద్వారా.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతుంది.

ఆరోగ్యంగా ఉంచుతాయి

గర్బ గుడిలో వేదమంత్రాలతో రాసిన పంచలోహా యంత్రాలను నిక్షప్తం చేసి ఉంచుతారు. పంచలోహానికి భూమిలో ఉండే పాజిటివ్ ఎనర్జీనీ గ్రహించే గుణం ఉంటుంది. ఈ లోహాలు గ్రహించిన శక్తిని గుడి పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తాయి. గర్భ గుడి చుట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా.. ఆ పాజిటివ్ శక్తులు శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.

ఆధ్యాత్మిక అనుబంధం

దేవాలయాలు.. దేవుళ్లను పూజించడానికి ప్రతీకగా ఉంటాయి. దేవుడికి భక్తులకు మధ్య ఆధ్యాత్మిక అనుబంధం అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. పూజలు, ప్రార్థనలు మనసుకు ఓదార్పు, శాంతిని కలిగిస్తాయి. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

మానసిక ప్రశాంతత

దేవాలయాలు ఆత్మ పరిశీలన, ధ్యానం చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశాలు. దేవత ముందు నిశ్శబదంగా కూర్చోవడం, ఆలయం చుట్టూ తిరగడం మనసును శాంతపరిచి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Also Read: Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

Advertisment
తాజా కథనాలు