Business: ధర 99..999 ఎందుకు పెడతారు?.. ఆ రూపాయి ఏమైంది సార్‌?

ఒక రూపాయి తగ్గించడం అంటే మానసిక మార్కెట్ వ్యూహం. మానసికంగా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్‌ చూపిస్తాడట. సైకలాజికల్ మార్కెట్ స్ట్రాటజీగా కస్టమర్లను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోడానికి ధర ట్యాగ్‌పై ఒక రూపాయి తగ్గిస్తారు.

tag

Tag

New Update

Business: మనం షాపింగ్‌ చేస్తున్నప్పుడు ధర ట్యాగ్‌పై రూ. 399, 599 ఇలా రాసి ఉండటం చూస్తుంటాం.  అంటే ఒక్క రూపాయి తక్కువ అని పెడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని చాలా సార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా రూపాయి తక్కువ పెట్టడం వల్ల వ్యాపారులకు ఒరిగేదేంటి అనుకుంటాం. రూ. 299 ఉన్నది రూ. 300కి విక్రయిస్తే రౌండ్‌ ఫిగర్‌ ఉంటుంది కదా అనిపిస్తుంది. అసలు రూపాయి తక్కువ పెట్టడానికి కారణమేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అమ్మకాలను పెంచుకోడానికి ధర ట్యాగ్‌పై.. 


హెండర్సన్‌లోని ఫ్రీడ్-హార్డెమాన్ విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ చెప్పిన దాని ప్రకారం.. ఒక రూపాయి తగ్గించడం అంటే మానసిక మార్కెట్ వ్యూహం. మానసికంగా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్‌ చూపిస్తాడు. ఒక మాల్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు ఒక సూట్‌ను ఇష్టపడతారు. దాని ధర రూ.799 ఉంటుంది. మనం ఒక సంఖ్యను చదివినప్పుడు ఆ సంఖ్య పరిధిని తెలుసుకునేలా మనం ఎడమ నుంచి కుడికి చూస్తాం.

ఇది కూడా చదవండి: పడుకునే ముందు ఇలా చేస్తే బాగా నిద్రపడుతుంది

ఏసీ ధర రూ.24,490 అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు మన మైండ్ సెట్ ఏసీ ధర రూ.24,000. ఎందుకంటే మేము ఎడమ సైడ్‌ ఉన్నదానిపై దృష్టి పెడతాం. మిగిలిన 490 రూ.24,000గా పరిగణించి వదిలేస్తుంటాం. అదే విధంగా ధర ట్యాగ్‌లో రూ. 799 చూసినప్పుడు కొంతమంది దానిని రూ. 800గా పరిగణించి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఎడమవైపు సైడ్‌ ఉన్న నెంబర్స్‌ చూసి దానిని రూ. 700 కదా కొనేద్దాం అనుకుంటుంటారు. కాబట్టి సైకలాజికల్ మార్కెట్ స్ట్రాటజీగా కస్టమర్లను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోడానికి ధర ట్యాగ్‌పై ఒక రూపాయి తగ్గిస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: మీ భార్య ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుందా.. ఈ చిట్కాలు పాటించండి

#business
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe