Hyderabad : రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. మర్మాంగాలు కోసి

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణ అలియాస్‌ రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంగా యూసుఫ్‌గూడకు చెందిన యువతి రౌడీ షీటర్లతో హత్య చేయించింది. మర్మాంగాలు కోసి క్రూరంగా చంపేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad : రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. మర్మాంగాలు కోసి
New Update

Murder : హైదరాబాద్(Hyderabad) నగరంలో రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది ఒకేసారి మూకుమ్మడిగా కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి, అతడి మర్మాంగాలను కోసి దారుణంగా హతమార్చారు. ఒళ్లు గగుర్లుపొడిచే భయంకరమైన సంఘటన నగరంలోని యూసఫ్ గూడ(Yusufguda)లో జరగగా స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

పుట్టా రాము..

ఈ ఘనటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంకు చెందిన పుట్టా రాము(Putta Ramu) అలియాస్‌ సింగోటం రాము అలియాస్‌ రమణ అలియాస్‌ రామన్న(36) రహమత్‌నగర్‌ లో ఉండేవాడు. డ్రైవర్‌గా పని చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అబ్దుల్‌కలాం పేరిట సామాజిక సేవా సంస్థను స్థాపించి.. కొల్లాపూర్‌ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఒంటి మీద దాదాపు అర కిలో బంగారు నగలు ధరించగా ‘గోల్డ్‌మ్యాన్‌’(Gold Man) గానూ పాపులర్ అయ్యాడు.

రాజకీయంగా ఎదగాలని బీజేపీలో చేరి..

అయితే చేతినిండా డబ్బు చేరడంతో రాజకీయంగా ఎదగాలనే తపనతో బీజేపీ(BJP) లో చేరాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం వ్యాపార విషయంలో జీడిమెట్ల రాంరెడ్డినగర్‌కు చెందిన మణికంఠపై తన అనుచరులతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ గొడవలో మణికంఠ ముఖానికి తీవ్ర గాయాలవగా ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకున్నాడు.

ఇది కూడా చదవండి : Telangana: గృహజ్యోతిలో కొత్త రూల్స్..వారికి మాత్రమే పథకం వర్తింపు!

మహిళతో సంబంధం..

ఇక రామన్న యూసుఫ్‌గూడ లక్ష్మీ నర్సింహ నగర్‌ లో నివసించే ఒక మహిళ ఇంటికి రెగ్యూలర్ గా వెళ్తుండేవాడు. ఆమెపై వ్యభిచారం కేసులు(Prostitute Cases) ఉన్నట్లు సమాచారం. కాగా ఆమె కుమార్తెను రామన్న కొంత కాలంగా ఇబ్బంది పెడుతుండగా ఆ యువతి తనకు దగ్గరగా ఉండే ఓ యువకుడి దృష్టికి తీసుకెళ్లింది. అతడు మణికంఠకు స్నేహితుడు కావడంతో ఇద్దరూ కలిసి రామన్న హత్యకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే యువతి బుధవారం రామన్నకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో మద్యం వెంట తీసుకెళ్లాడు. వెంటనే ఆమె యువకుడికి సమాచారం అందించింది. అతనితోపాటు మణికంఠ, బోరబండలో నివసించే రౌడీషీటర్‌ జిలానీ సహా మొత్తం పది మందిని తీసుకుని కత్తులు వెంట పట్టుకుని వచ్చాడు.

మూకుమ్మడి దాడి..

ఈ క్రమంలోనే రాత్రి 11.45 గంటల ప్రాంతంలో వారంతా ఇంట్లోకి చొరబడి రామన్నపై దాడికి దిగారు. అతని ప్రైవేట్ పార్ట్స్ కొసేశారు. ఆ కత్లిపోట్లకు తీవ్ర రక్తస్రావం కావడంతో రామన్న అక్కడికక్కడే మరణించాడు. అంతటితో ఆగకుండా రామన్న బామ్మర్దికి వీడియో కాల్‌ చేసిన మణికంఠ ‘నీ బావను చంపేశాం. వచ్చి బాడీ తీసుకెళ్లు’ అని తెలిపాడు. అనంతరం వారంతా అక్కడి నుంచి పరారు కాగా యువతి మాత్రం అక్కడే ఉండిపోయింది.

పటాసులు కాల్చి సంబరాలు..

ఇక ఈ హత్య తర్వాత అర్ధరాత్రి రాంరెడ్డి నగర్‌ ప్రాంతంలో మణికంఠ టీమ్(Manikanta Team) పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత మణికంఠ, జిలానీ మరో ముగ్గురు కలిసి కత్తులతో గురువారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయియారు. మిగతా నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకొని ఫిల్మ్‌నగర్‌ ఠాణాలో విచారించినట్లు తెలుస్తోంది.

Also Read : Eagle Movie Review: తుపాకీ రెక్కలతో.. మాస్ రచ్చ.. రవితేజ ఈగల్

#yusufguda #ramana-alias-ramanna #real-estate-businessman #brutally-murdered #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe