Real Estate : నగరాల్లో వేగంగా పెరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు..

మన దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇళ్ల నిర్మాణాలు బాగా పెరిగాయి. గతేడాది 8 శాతం ఇళ్ల నిర్మాణాలు పెరిగి 4.35 లక్షలకు చేరుకున్నాయి. ఈ నగరాలలో ఈ ఏడాది కూడా ఇళ్ల నిర్మాణాలు, అమ్మకాలు భారీగానే ఉండవచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

New Update
Real Estate : నగరాల్లో వేగంగా పెరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు..

Real Estate In Metro Cities : కరోనా(Corona) మహమ్మారి తర్వాత దేశంలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణాలు గతేడాది ఎనిమిది శాతం పెరిగి 4.35 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. మెరుగైన అమ్మకాలు  రియల్ ఎస్టేట్ కంపెనీల నగదు ప్రవాహాన్ని మెరుగుపరిచాయని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ అనరాక్ పేర్కొంది. ఇదొక్కటే కాదు, రియల్ ఎస్టేట్ రంగం ANAROCK డేటా ప్రకారం, 2023లో 4,35,045 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2022లో 4.02 లక్షల ఇళ్లను నిర్మించారు. డేటా ప్రకారం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో గత ఏడాది 13 శాతం వృద్ధితో 1,43,500 ఇళ్ల నిర్మాణం పూర్తయింది, 2022లో ఈ సంఖ్య 1,26,720 యూనిట్లుగా ఉంది.

నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఢిల్లీ(NCR) లో గత ఏడాది 32 శాతం(Real Estate) పెరుగుదలతో 1,14,280 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2022లో 86,300 ఇళ్లను నిర్మించారు. అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ, '2023 సంవత్సరంలో గృహాల విక్రయాలు 2022 కంటే మునుపటి గరిష్ట స్థాయిని అధిగమించాయి. ఇది 2024లో కూడా బలంగానే ఉంటుంది అని చెప్పారు. 

పూణేలో గత ఏడాది 65,000 ఇళ్ల నిర్మాణం(Real Estate) పూర్తయింది, 23 శాతం క్షీణత, 2022లో 84,200 ఇళ్లను నిర్మించారు. బెంగళూరు(Bangalore), హైదరాబాద్(Hyderabad), చెన్నై(Chennai) లలో కలిపి గతేడాది 87,190 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2022లో 81,580 ఇళ్లు నిర్మాణం అయ్యాయి. 

కోల్‌కతాలో గతేడాది 25,075 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2022లో 23,190 ఇళ్లను నిర్మించారు. 2017 తర్వాత ఇళ్ల నిర్మాణం ఇదే అత్యధికమని అనరాక్ చెప్పారు. 2017లో 2,04,200 ఇళ్లు, 2018లో 2,46,140 ఇళ్లు, 2019లో 2,98,450 ఇళ్లు, 2020లో 2,14,370 ఇళ్లు, 2021లో 2,78,650 ఇళ్లు పూర్తయ్యాయి.

Also Read : పదేళ్లలో 10 రూపాయల్ని పదివేలు చేసిన మూడు ఫండ్స్ ఇవే!

మరోవైపు మన దేశంలో ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లకు(Real Estate) డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో 2022 కంటే గతేడాది లగ్జరీ ఇళ్ల సంఖ్య దాదాపు 90శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CBRE తన తాజా రిపోర్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లగ్జరీ అంటే విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడానికి సంపన్న వర్గాల వ్యక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని రిపోర్ట్ చెబుతోంది. హైదరాబాద్ తో పాటు దేశంలోని ఏడు  ప్రధాన నగరాల్లో నాలుగు కోట్ల రూపాయలు లెదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు 2023లో 75% అధికంగా జరిగాయి. హైదరాబాద్ లో 2023లో 2,030 లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జరిగాయి. అదే 2022లో వీటి సంఖ్య 1,240 యూనిట్స్ గా ఉన్నాయి. 

ఇక దేశవ్యాప్తంగా హైదరాబాద్ తో బాటు ఏడూ ప్రధాన నగరాల్లో 2023లో 12,935 విలాసవంతమైన ఇళ్ల (Real Estate)అమ్మకాలు (4 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ధర) జరిగాయి. అదే 2022లో ఈ ఇళ్ల సంఖ్య 7,395 మాత్రమే. భవిష్యత్ లో కూడా విలాసవంతమైన గృహాల అమ్మకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్కెట్ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మ్యాగజీన్‌ చెప్పారు.

Watch this Interesting Video :

Advertisment
తాజా కథనాలు