ఖననం చేసిన మృతదేహానికి రీ పోస్టుమార్టం తరచూ మహిళలపై దారుణాలు జరగటం చూస్తూనే ఉన్నాం. జనగామ జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సుభద్ర కేసులో నిందితుడు ఎవరో తెలియడం వలన మళ్ళీ ఖననానికి రీ పోస్టుమార్టం చేయడానికి పోలీసులు అనుమతించారు. ఈ పోస్టుమార్టం నిపుణుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. By Vijaya Nimma 06 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ఖననం చేసిన మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సదాశివపేట గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 20న అనుమానాస్పదంగా మృతి చెందిన సుభద్రకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తర్వాత ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఖననం చేసిన 35 రోజుల తర్వాత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అప్పట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని నివేదిక ఇచ్చారు వైద్యులు. అయితే ఇటీవల జరిగిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసు విచారణ సందర్భంగా హత్య కేసు ప్రధాన నిందితుడైన గిరబోయిన అంజయ్య సుభద్రను హత్య చేసినట్టు అంగీకరించడంతో రీ పోస్టుమార్టంకు ఆదేశించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. కాకతీయ వైద్య కళాశాల ప్రొఫెసర్లు నిపుణులు సమక్షంలో పోస్టుమార్టం జరగనున్నంది. ఖననం చేసిన 65 రోజుల తరువాత మహిళ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. బచ్చన్నపేట మండలంలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య విషయంలో తోవుతున్నా కొద్ది సంచలన వాస్తవాలు బయట పడుతున్నాయి. ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికీ ప్రధాన నిందితుడు అంజయ్యతో పాటు 11 మంది రిమాండ్ చేశారు. అందులో అంజయ్య గతంలో హత్య చేసిన సుభద్ర మృతదేహాన్ని ఇప్పుడు మళ్లీ వెలికి తీసి రీ పోస్టుమార్టం చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఈ రీ పోస్ట్‌మార్ట్ వెనుక మరి ఇంకెన్ని విస్తీ పోయే వాస్తవాలు బయటికి వస్తాయో అని చెప్పి ఒక ఆసక్తి నెలకొని ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి