RCB Eliminator Match: ఎలిమినేటర్ మ్యాచ్ ల్లో ఆర్సీబీ రికార్డ్ ఇదే..

ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ మే 22న జరగనుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లలో ఆర్సీబీ రికార్డ్ ఎలా ఉంది? ఆర్సీబీ ఎన్నిసార్లు మ్యాచ్ లు ఆడింది? ఎన్ని గెలిచింది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

RCB Eliminator Match: ఎలిమినేటర్ మ్యాచ్ ల్లో ఆర్సీబీ రికార్డ్ ఇదే..
New Update

RCB Eliminator Match: ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. మే 22న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం. అంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆర్సీబీ జట్టు ఫైనల్ ఆశ సజీవంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో అసలు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ఆర్సీబీకి ఎలాంటి రికార్డ్ ఉంది? ఇప్పటివరకూ ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో నుంచి ఎన్నిసార్లు బతికి బట్టకట్టింది? తెలుసుకుందాం. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు సార్లు మాత్రమే ఫైనల్‌లో ఆడింది. కానీ 16 సీజన్లలో 14 సార్లు ప్లేఆఫ్స్ కు చేరుకుంది.  అయితే, ఎలిమినేటర్‌ మ్యాచుల్లో మాత్రం కేవలం 4 సార్లు మాత్రమే ఆడింది.

RCB Eliminator Match: RCB మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ 2015లో జరిగింది. ఈ మ్యాచ్‌లో RCB, RR జట్లు తలపడ్డాయి. నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా RCB 2వ క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. కానీ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో CSK చేతిలో ఓడిపోయింది. ఇక 2020లో, RCB జట్టు 4వ స్థానంతో ఎలిమినేటర్ రౌండ్‌లోకి ప్రవేశించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Also Read:  కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన ‘SRH’ ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ!

RCB Eliminator Match: దీని తర్వాత, RCB 2021లో మళ్లీ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించగలిగింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆర్‌సిబి జట్టు విజయం సాధించలేకపోయింది. మళ్లీ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించగలిగింది. ఈసారి RCB జట్టు లక్నో సూపర్ జెయింట్‌ ప్రత్యర్థిగా పోరాడింది.  LSGతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా RCB 2వ క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. కానీ 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తడబడి ఓడింది. 

RCB Eliminator Match: అంటే ఐపీఎల్ చరిత్రలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ జట్టు రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి RCB ఎప్పుడూ ఫైనల్‌కు చేరుకోలేదు. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ ల్లో ముందు వెనుకబడి.. తరువాత వరుసగా 6 విజయాలతో సరికొత్త హవాలో ఉన్న ఆర్సీబీ ఇదే ఊపు కొనసాగిస్తే, ఈసారి ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి టైటిల్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

#cricket #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe