Paytm: పీకల్లోతు కష్టాల్లో పేటీఎం..ఆర్బీఐ మరిన్ని చర్యలు..మీరు పేటీఎం ఉపయోగిస్తుంటే ఇది మీకోసమే..! పేటీఎం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. మార్చి 15 తర్వాత పేటీఎం యూపీఐ ఉపయోగించే మర్చంట్లు, కస్టమర్ల అకౌంట్స్ ను వేరే బ్యాంకులు మార్చాలని సూచించింది. అయితే దీనిపై ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. By Bhoomi 23 Feb 2024 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Paytm: ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎంపై తాజాగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కస్టమర్ల ఖాతాలు, వాలెట్లు మార్చి 15 తర్వాత డిపాజిట్లు లేదా క్రెడిట్ ను అనుమతించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేటీఎం యూపీఐ హ్యాండిల్ ను ఉపయోగిస్తున్న మర్చంట్లు, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఆర్బీఐ శుక్రవారం మరిన్ని చర్యలు తీసుకుంది. పేటీఎం యాప్ లో యూపీఏ ఛానెల్ ద్వారా లావాదేవీలు కొనసాగించేందుకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా మారాలనుకుంటున్న వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ అభ్యర్థనను పరిశీలించాలని ఎన్పీసీఐ ని ఆర్బీఐ కోరింది. వన్ 97 పేటీఎం అనేది మాతృ సంస్థ. కాగా ప్రస్తుతం పేటీఎం యూపీఐ హ్యాండిల్ ను ఉపయోగిస్తున్న మర్చంట్లు, కస్టమర్లకు మాత్రమే చర్యలు వర్తిస్తాయి. ఒక వేళ మీరు యూపీఐ లావాదేవీల కోసం పేటీఎం హ్యాండిల్ ను ఉపయోగిస్తున్నట్లయితే ఈ వివరాలు తెలుసుకోవల్సిందే. వన్ 97కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదాను కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేటీఎం హ్యాండిల్స్ ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎక్కువ సంఖ్యలో యూపీఐ లావాదేవీలను నిర్వహించే సామర్థ్యం కలిగిన 4 లేదా 5 బ్యాంకులను పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులుగా గుర్తించాలని ఎన్పీసీఐ ని కోరింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్స్, వాలెట్ ఉన్నవినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని RBI మరోసారి తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్,నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు ఉన్నవారు కూడా మార్చి 16 లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ చర్యలన్నీ కస్టమర్లను, చెల్లింపు వ్యవస్థను అవాంతరాల రక్షించాలనే చెపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై తీసుకున్న చర్యల్లో ఎలాంటి పక్షపాతం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి : కవితకు సీబీఐ నోటీసులు… జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు #rbi #upi #paytm-payments-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి