RBI-Retail Direct Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020 (పన్ను విధించదగినది)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. అక్టోబర్ 23న ఆర్‌బిఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, చందాదారులు తమ రిటైల్ డైరెక్ట్ లాగిన్‌లో అందుబాటులో ఉన్న వేలం ద్వారా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్‌ల కోసం బిడ్‌లు వేయవచ్చు.
FRSB 2020 (T)గా పిలువబడే ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆకర్షణీయయమైన పెట్టుబడి మార్గంగా ఇవి ఉంటాయి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) కంటే ఎక్కువ వడ్డీ రేటును లభిస్తుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు (+) 35 bps తో NSC ప్రస్తుత రేటుతో అనుసంధానించబడి ఉంటాయి. ప్రస్తుతం FRSB 2020 (T) డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అయ్యే 8.05% వడ్డీరేటును అందిస్తుంది.
పెట్టుబడిదారులు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఆరు నెలలకు సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన బాండ్స్‌పై పెట్టుబడి పెట్టే వారికి రిస్క్ లేని రాబడి లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లపై ప్రతి ఆరు నెలలకు జనవరి 1, జూలై 1న సమీక్ష చేయడం జరుగుతుంది.
ఈ బాండ్లు జారీ చేసిన తేదీ నుండి 7 సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉంటాయి. అయితే, సీనియర్ సిటిజన్‌లు 4, 5, 6 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌ల తర్వాత అందుబాటులో ముందస్తు నిష్క్రమణ ఆప్షన్ ప్రయోజనాన్ని పొందుతారు.
ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!
FRSB 2020 (T) కోసం పెట్టుబడి థ్రెషోల్డ్ చాలా సరళమైనది. కనీస పెట్టుబడి రూ. 1,000గా నిర్ణయించడం రిగింది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. తద్వారా వివిధ వర్గాల పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే, పెట్టుబడిదారులు పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. ముందుగా, ఈ బాండ్లపై వచ్చే వడ్డీ పన్నుకు లోబడి ఉంటుంది. వడ్డీని చెల్లించినప్పుడు పన్ను (TDS) వర్తిస్తుంది. రెండవది, ఈ బాండ్‌లను బదిలీ చేయడం సాధ్యం కాదు. ట్రేడ్ చేయడం కూడా సాధ్యం కాదు. అంటే మెచ్యూరిటీ వరకు వాటిని ఉంచుకోవాల్సిందే.
RBI-రిటైల్ డైరెక్ట్ స్కీమ్ నవంబర్ 12, 2021న ప్రారంభించడం జరిగింది. వ్యక్తిగత పెట్టుబడిదారులు నేరుగా RBIతో రిటైల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతాను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ఆన్‌లైన్ పోర్టల్ (https://rbiretaildirect.org.in) ద్వారా సౌకర్యవంతంగా చేయబడుతుంది. ఇది ప్రాథమిక, ద్వితీయ మార్కెట్‌లలో ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులను అనుమతిస్తుంది. ప్రస్తుతం, రిటైల్ పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్‌లతో సహా రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా వివిధ ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. పెట్టుబడి ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా రిటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా అందుబాటులో ఉంచడం ఈ పథకం లక్ష్యం.
ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..