RBI Moved Gold: ఇంగ్లాండ్ బ్యాంక్ నుంచి 100 టన్నుల బంగారం తెచ్చుకున్న భారత్.. ఎందుకంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్టోర్ చేసిన బంగారం నుంచి 100 టన్నులు మన దేశానికి తరలించింది. భవిష్యత్ లో మరో 100 టన్నుల బంగారం కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇలా బంగారాన్నితెచ్చుకుంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

RBI Moved Gold: ఇంగ్లాండ్ బ్యాంక్ నుంచి 100 టన్నుల బంగారం తెచ్చుకున్న భారత్.. ఎందుకంటే..
New Update

RBI Moved Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల భారీగా బంగారం కొనుగోలు చేసింది. అంతేకాకుండా, బ్యాంకు బ్రిటన్ నుండి 100 టన్నులకు పైగా బంగారాన్ని తెచ్చుకుంది. 1991 తర్వాత సెంట్రల్ బ్యాంక్ తన స్థానిక నిల్వల్లో ఇంత మొత్తంలో బంగారాన్ని డిపాజిట్ చేయడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో కూడా మరో 100 టన్నుల బంగారం దేశంలోకి ప్రవేశించవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన సమాచారం ప్రకారం  దేశంలో బంగారం నిల్వ చేయడానికి లాజిస్టికల్ కారణాలు ఉన్నాయి. అలాగే, సెంట్రల్ బ్యాంక్ దాని నిల్వను డైవర్సిఫికేట్ చేస్తుంది. తాజా గణాంకాల ప్రకారం, మార్చి చివరి నాటికి, RBI వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413.8 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ విదేశాల్లో ఉంచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ తన నిల్వల్లో 27.5 టన్నుల బంగారాన్నికొనుగోలు ద్వారా పెంచుకుంది. 

RBI Moved Gold: సాంప్రదాయకంగా, ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని లండన్‌లో ఉంచాయి. భారతదేశం కూడా ఇప్పటి వరకు తన బంగారాన్ని లండన్‌లో ఉంచుకునేది, కానీ ఇప్పుడు దాని బంగారాన్ని పెద్ద మొత్తంలో దేశంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే, నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల కొత్త బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతదేశం నిరంతరం బంగారం కొనుగోలు చేయడం దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, దాని ఆర్థిక భద్రతా నిర్వహణను బలోపేతం చేస్తుందని చూపిస్తుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒకటి.

Also Read:  ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే దొరికిపోతారు!

భారత్‌కు బంగారం ఎలా వచ్చింది?
RBI Moved Gold: ఆర్‌బీఐ దాదాపు 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే గత కొన్నేళ్లుగా కొనుగోళ్ల ద్వారా బంగారం స్టాక్‌ను నిరంతరం పెంచుకుంటూ వస్తోంది. "ఇది ఆర్థిక వ్యవస్థ బలం -  విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.  ఇది 1991 నాటి పరిస్థితికి పూర్తి విరుద్ధంగా ఉంది" అని అధికారులు చెబుతున్నారు. కానీ విదేశాల నుంచి 100 టన్నుల బంగారాన్ని తీసుకురావడం భారీ లాజిస్టికల్ కసరత్తుగా భావించవచ్చు. మార్చి చివరి నాటికి దేశంలో ఉన్న బంగారం స్టాక్‌లో ఇది దాదాపు నాలుగో వంతు. అందుకే నెలరోజుల ప్రణాళిక అలాగే, దీని కచ్చితమైన అమలు అవసరం అయింది.  ఆర్థిక మంత్రిత్వ శాఖ, RBI, అనేక ప్రభుత్వ సంస్థలు, స్థానిక అధికారుల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుంది. 

అప్పట్లో తాకట్టులో మన బంగారం..
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుండగా, దాదాపు 3 దశాబ్దాల క్రితం నాటి కాంగ్రెస్-థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు భారత్ బంగారాన్ని తాకట్టు పెట్టాయి. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్‌ తన బంగారాన్ని విదేశాలకు పంపి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. జూలై 1991లో, కాంగ్రెస్ నరసింహారావు ప్రభుత్వం డాలర్లను సేకరించేందుకు విదేశీ బ్యాంకుల్లో బంగారాన్ని తనఖా పెట్టింది. జూలై 1991లో, నరసింహారావు ప్రభుత్వం 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్,  బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో $400 మిలియన్లను సేకరించేందుకు తాకట్టు పెట్టింది. బంగారాన్ని తనఖా పెట్టడానికి ముందు, భారతదేశం కొంత బంగారాన్ని విక్రయించింది కూడా.

RBI Moved Gold: మొదటగా, బంగారాన్ని దేశంలోకి తీసుకురావడానికి ఆర్‌బిఐ కస్టమ్స్ డ్యూటీలో మినహాయింపు పొందింది. ఈ విధంగా కేంద్రం ఈ సార్వభౌమ ఆస్తిపై ఆదాయాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపు లేదు. దిగుమతులపై ఈ పన్ను విధిస్తారు. ఈ పన్ను రాష్ట్రాలతో పంచుకోవడమే ఇందుకు కారణం. భారీ మొత్తంలో బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేక విమానం కూడా అవసరమైంది. ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ చర్య RBIకి బంగారాన్ని స్టోర్ చేయడం కోసం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెల్లించాల్సిన డబ్బును మిగుల్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే, ఈ మొత్తం పెద్ద ఎక్కువ కాదు కానీ, ఎంతో కొంత పొదుపు చేయడం జరుగుతుంది కదా. ఇక మన దేశంలో బంగారం ముంబైలోని మింట్ రోడ్‌లోని పాత ఆర్‌బిఐ భవనంలో, అలాగే నాగ్‌పూర్‌లోనూ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. 

#gold #rbi #england-bank
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe