IIFL Finance ఇకపై కొత్తగా గోల్డ్ లోన్స్ ఇవ్వలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI తక్షణం అమలులోకి వచ్చేలా నిషేధించింది. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో అనేక అవకతవకలను ఆర్‌బీఐ గుర్తించింది. అయితే, కంపెనీ ఇప్పటికే ఉన్న గోల్డ్ లోన్ కస్టమర్లకు తన సర్వీసులను కొనసాగించవచ్చు. “గత కొన్ని నెలలుగా, సెంట్రల్ బ్యాంక్ ఈ లోపాల గురించి కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్, ఆడిటర్‌లతో చర్చిస్తోంది. అయితే ఇప్పటి వరకు అర్ధవంతమైన దిద్దుబాటు చర్యలు సంస్థ(IIFL Finance) తీసుకోలేదు. అటువంటి పరిస్థితిలో, వినియోగదారుల మొత్తం ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిమితి అవసరం.” అని ఆర్బీఐ ప్రకటించింది.
RBI - IIFL Finance గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 4 ప్రధాన లోపాలను గుర్తించింది..
- రుణం మంజూరయ్యే సమయంలో బంగారం స్వచ్ఛత, బరువును తనిఖీ చేయడంలో అక్రమాలు జరిగాయి. వేలంలో డిఫాల్ట్‌గా ఉంది.
- రుణం-విలువ నిష్పత్తి కూడా ఉల్లంఘిస్తున్నారు. అంటే పరిమితికి మించి రుణాలు అందజేసారు.
- నగదు రూపంలో రుణాల చెల్లింపు.. వసూలుపై కూడా కంపెనీ పరిమితిని ఉల్లంఘిస్తోంది.
- కస్టమర్ల ఖాతాలపై విధించే ఛార్జీలు తదితరాల్లో పారదర్శకత లోపించింది .
Also Read: రెండు సంస్థలుగా టాటా మోటార్స్.. షేర్ హోల్డర్స్.. కస్టమర్ల పరిస్థితి ఏమిటి?
500 నగరాలు.. 2600 బ్రాంచ్ లు..
IIFL Finance లిమిటెడ్ అనేది 500 కంటే ఎక్కువ నగరాల్లో 2600 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉన్న ఆర్థిక సేవల సంస్థ. ఇది దాని అనుబంధ సంస్థల ద్వారా వివిధ రకాల రుణాలను అందిస్తుంది - IIFL హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, IIFL సమస్త్ ఫైనాన్స్ లిమిటెడ్, IIFL ఓపెన్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు. వీటిలోహోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ అలాగే మైక్రో ఫైనాన్స్ వంటి లోన్స్ ఈ సంస్థ అందచేస్తుంది. IIFL Finance 500 కంటే ఎక్కువ నగరాల్లో 2600 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది. వీటి ద్వారా దాని సేవలను అందిస్తుంది.
షేరు పతనం..
ఆర్బీఐ చర్యల తరువాత సోమవారం IIFL Financeషేర్లు 3.94 శాతం పతనంతో రూ.598 వద్ద ముగిశాయి. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 31.75% రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది స్టాక్ ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాది స్టాక్ -0.79% క్షీణించింది. 5 సంవత్సరాలలో స్టాక్ 226.53% పెరిగింది.