RBI: బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ అలర్ట్.. వాటిని నమ్మి మోసపోవద్దని వార్నింగ్!

రుణమాఫీ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. తాము అధికారంలోకి వస్తే రైతులు, మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. రుణమాఫీ ప్రచారంపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతిదీ ట్రాక్!
New Update

రాష్ట్రం ఏదైనా సరే ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడే ఎక్కువగా వినిపించే మాట రుణమాఫీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.  ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది. రుణమాఫీలపై అనధికారిక ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డిసెంబర్ 11న సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాంటి ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది. అలాంటి తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రచారాల ఉచ్చులోపడి మోసపోకూడదంటూ పేర్కొంది. అలాంటివాటిని గుర్తిస్తే వెంటనే పోలీసులు, సంబంధిత అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలని ఆర్బీఐ కోరింది.

రుణమాఫీని ఆశగా చూపి రుణగ్రహీతలను తప్పుదోవ పట్టించే కొన్ని సంస్థల ప్రకటనలను గుర్తించిన క్రమంలో ఈ మేరకు ప్రజలను హెచ్చరిస్తూ ఈ ప్రకటన చేసింది ఆర్బీఐ. అలాంటి సంస్థలు ప్రింట్ మీడియాతోపాటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అనేక ప్రచారాలు చేస్తున్నాయి. ఎలాంటి అధికారిక గుర్తింపు లేకుండానే రుణమాఫీ సర్టిఫికేట్లను జారీ చేస్తూ సర్వీస్ ఛార్జీలు లేదా లీగల్ ఫీజులను వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు రుణమాఫీలపై తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నట్లు తమ ద్రుష్టికి వచ్చిందని ఆర్బీఐ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకులు రుణాల వసూలు ప్రక్రియను బలహీనపరుస్తుందని తెలిపింది. దీంతో చాలా మంది లోన్స్ కట్టడం లేదని తెలిపింది.అలాంటివారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇకపై లోన్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేస్తున్నారని ఆర్బీఐ మండిపడింది. అలాంటి చర్యలు ఫైనాన్షియల్ సంస్థలు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయని పేర్కొంది. అలాగే డిపాజిటర్లపైనా ఆ ప్రభావం పడుతుందని ...ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.

కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రుణమాఫీ ప్రకటనలు చేస్తున్నాయి. అది బ్యాకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసిన వెంటనే రుణాలు తీసుకున్న వారు తమ నెలవారీ వాయిదాలను చెల్లించడం మానేస్తున్నారని ఆర్బీఐ అంటోంది. దీంతో బ్యాంకకుల నిరర్దక ఆస్తుల విలువ గుట్టల్లా పేరుకుపోతోంది. ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీతోపాటు కాంగ్రెస్ రెండు పార్టీ కూడా రుణమాఫీలు ప్రకటించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేశాయి. దీంతో లోన్స్ చెల్లించే వారి సంఖ్య తగ్గిపోతుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి:  మీ పార్ట్‎నర్ రాత్రంతా గురకతో చిర్రెత్తిస్తున్నారా? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి..దెబ్బకు గురక వదలాల్సిందే…!!

#rbi #business-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe