Railway Jobs Notification : దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (Railway Recruitment Board) దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీఅజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, సికింద్రాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ (RRB) రీజియన్లలో ఉన్నాయి.
విద్యార్హతలు: పోస్టుకు తగ్గట్లు సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్లలోపు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.500. ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ,ఎస్సీలకు ఫీజు రూ.250.
జీతభత్యాలు
జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.35,400 ప్రారంభ వేతనం ఉంటుంది.
కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి రూ.44,900 ప్రారంభ వేతనం ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ
స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.