Gautam Singhania: రేమండ్ (Raymond)గ్రూప్ అధినేత, బిలియనీర్ తన భార్యతో విడిపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గౌతమ్ సింఘానియా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. తన భార్య అయిన నవాజ్ మోడీతో (Nawaz Modi) వేరుపడినట్లు..ఇక నుంచి ఎవరి ప్రయాణాలు వారివే అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం జరిగిన దీపావళి పార్టీకి తనను రాకుండా తన భర్త అడ్డుకున్నట్లు నవాజ్ ఓ వీడియోలో చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆమె వీడియో విడుదల చేసిన కొన్ని గంటలకే ఇద్దరు విడిపోతున్నట్లు సింఘానియా తెలిపారు.
ఆదివారం నాడు థానేలో సింఘానియాకు చెందిన జేకే గ్రామ్ లో దీపావళి సంబరాలు జరిగాయి. ఆ కార్యక్రమానికి సింఘానియా తన భార్యతో కాకుండా మరో మహిళతో కలిసి వచ్చారు. అదే సమయంలో ఆ పార్టీ జరుగుతున్న ప్రదేశానికి నవాజ్ మోడీ కూడా వచ్చారు. అయితే ఆమెను లోనికి రాకుండా సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో ఆమె బయట కారులోనే వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె వీడియోలో నేను దాదాపు 3 గంటల పాటు బయట వేచి ఉన్నానని వివరించింది. దాంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో '' ఈ దీపావళి గతంలో మాదిరిగా ఉండదు. ఇక పై నవాజ్ నేను వేరువేరు మార్గాలను అనుసరిస్తామని నా నమ్మకం. 32 ఏళ్లు జంటగా కలిసి ఉండటం, తల్లిదండ్రులుగా ఎదగడం, ఒకరికొకరు బలంగా ఉండటం కోసం మేం నిబద్దత, సంకల్పం, విశ్వాసంతో ప్రయాణించాం. ఎందుకంటే మా జీవితంలో రెండు అత్యంత అందమైన చేర్పులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మా జీవితాలు చుట్టూ అనేక రుమార్స్ వ్యాపించాయి. కాబట్టి నేను ఆమెతో విడిపోతున్నాను. అందుకే మేము మా రెండు విలువైన వజ్రాలైన నిహారిక, నిసా కోసం ఉత్తమమైనవే చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.
అయితే గౌతమ్ సింఘానియా మాత్రం తమ ఇద్దరు పిల్లల విడిపోవడం, కస్టడీకి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని వివాహం చేసుకున్నారు.
Also read: దీపావళి వేడుకల్లో ప్రమాదం..లండన్ లో భారత సంతతి కుటుంబం మృతి!