Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' నుండి రొమాంటిక్ సాంగ్.. భాగ్యశ్రీ తో రవితేజ ఘాటు రొమాన్స్ మామూలుగా లేదుగా!

రవితేజ లేటెస్ట్ మూవీ'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రోమో వదిలారు. ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో రవితేజ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది. దీన్ని బట్టి ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అని అర్థమవుతుంది. ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' నుండి రొమాంటిక్ సాంగ్.. భాగ్యశ్రీ తో రవితేజ ఘాటు రొమాన్స్ మామూలుగా లేదుగా!
New Update

 Raviyteja's Mr.Bachchan First Single Promo : హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షాక్, మిర‌ప‌కాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. రీసెంట్ గా 'షో రీల్' పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ సింగిల్ ప్రోమో వదిలారు. ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో రవితేజ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది. దీన్ని బట్టి ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అని అర్థమవుతుంది. జస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తున్న ఈ ప్రోమో చూస్తుంటే రవితేజ - హరీష్ శంకర్ ల 'మిరపకాయ్' సినిమానే గురొస్తుంది.

Also Read : ‘సరిపోదా శనివారం’.. ఒక్క పోస్టర్ తో ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసిన నాని!

ఆ సినిమాలో 'గది తలుపుల బిడియం' అనే రొమాంటిక్ సాంగ్ తరహాలోనే మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ ఉండబోతుంది. ఈ సాంగ్ లో హీరో,హీరోయిన్ మధ్య ఘాటు రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని జస్ట్ ప్రోమో తోనే హింట్ ఇచ్చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్న ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

#raviteja #mr-bachchan-movie #mr-bachchan-first-single
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe