Vikramarkudu : మాస్ రాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'విక్రమార్కుడు' రీ రిలీజ్, ఎప్పుడంటే?

రవితేజ ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ 'విక్రమార్కుడు' రీ రిలీజ్ కాబోతుంది. 2006లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని 18 ఏళ్ల తర్వాత తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 27 న రీ రిలీజ్‌ కాబోతుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

New Update
Vikramarkudu : మాస్ రాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'విక్రమార్కుడు' రీ రిలీజ్, ఎప్పుడంటే?

RaviTeja's Vikramarkudu Re Release : టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య రీ రిలీజ్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది.

దాంతో ఇకనుంచి రీ రిలీజ్ ట్రెండ్ కి ఎండ్ కార్డు పడిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఈ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. రానున్న రోజుల్లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.ఈ లిస్ట్ లో మొదటగా మాస్ మహారాజా ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమానే 'విక్రమార్కుడు'.. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006లో విడుదలైంది.

publive-image

Also Read : నేషనల్ క్రష్ ట్యాగ్ పై రియాక్ట్ అయిన ‘యానిమల్’ బ్యూటీ.. అది ట్యాగ్ మాత్రమే కాదంటూ!

ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇందులో రవితేజ అత్తిలి సత్తి, విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పాత్రల్లో అద్భుతంగా నటించాడు. సినిమాలో ఆయన నటన రాజమౌళి డైరెక్షన్ ను సైతం డామినేట్ చేసింది. అలాంటి ఈ మూవీ 18 ఏళ్ల తర్వాత తిరిగి జులై 27, 2024న రీ రిలీజ్‌ కాబోతుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంటా ఈ మూవీని 4K వెర్షన్ లో థియేటర్స్ లో చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు