Mr Bachchan: మిస్టర్ బచ్చన్ 'షో రీల్'.. వైరలవుతున్న అప్డేట్..!

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 17న మూవీ షూట్ కు సంబంధించిన 'షో రీల్' ఒకటి రిలీజ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ 'షో రీల్'.. వైరలవుతున్న అప్డేట్..!
New Update

Mr Bachchan: టాలీవుడ్ మాస్ మహారాజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షాక్, మిర‌ప‌కాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

మిస్టర్ బచ్చన్ షో రీల్

మిస్టర్ బచ్చన్ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా షూట్ కు సంబంధించి ఒక షో రీల్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు దర్శకుడు హరీష్ శంకర్. ఎప్పటిటిలా టీజర్, గ్లిమ్ప్స్ కాకుండా ఈ సారి కొత్తగా 'షో రీల్' రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఓ ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Ananth Ambani: రాధిక డ్రెస్ లో అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖ.. ఫొటో వైరల్

#mr-bachchan-show-reel #raviteja-mr-bachchan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe