/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-4-8.jpg)
Mr Bachchan: టాలీవుడ్ మాస్ మహారాజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షాక్, మిరపకాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
A MASS MAHARAAJ fan gatecrashes the sets of #MrBachchan and gets us an exciting update 🤩🤩
- https://t.co/elnOXUqmtn#MrBachchanShowreel out on June 17th. This one is going to be a cracker 💥💥#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl @harish2you @IamJagguBhai… pic.twitter.com/U9XbyGkaf3— People Media Factory (@peoplemediafcy) June 15, 2024
మిస్టర్ బచ్చన్ షో రీల్
మిస్టర్ బచ్చన్ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా షూట్ కు సంబంధించి ఒక షో రీల్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు దర్శకుడు హరీష్ శంకర్. ఎప్పటిటిలా టీజర్, గ్లిమ్ప్స్ కాకుండా ఈ సారి కొత్తగా 'షో రీల్' రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఓ ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Ananth Ambani: రాధిక డ్రెస్ లో అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖ.. ఫొటో వైరల్