Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్, మాస్ రాజా యాక్షన్ అదుర్స్!

రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రవితేజ యాక్షన్ సీన్స్, హరీష్ శంకర్ మార్క్ మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ సాగింది. అలాగే ఇందులో వింటేజ్ రవితేజను గుర్తు చేశాడు హరీష్ శంకర్. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.

New Update
Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్, మాస్ రాజా యాక్షన్ అదుర్స్!

Mr.Bachchan Movie Trailer : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న హైలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్‌లో రవితేజ తనదైన మాస్ యాక్షన్ మేనియాతో అలరించాడు. రవితేజ యాక్షన్ సీన్స్, డైలాగ్స్‌తో హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కలిపి ఈ సినిమా ఒక పూర్తి వినోదాత్మక చిత్రంగా ఉండబోతుంది. హరీష్ శంకర్ తనదైన స్టైల్‌లో డైలాగ్స్ రాశారు. ఈ డైలాగ్స్ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చాయి. అలాగే ఇందులో వింటేజ్ రవితేజను గుర్తు చేశాడు హరీష్ శంకర్. ఈ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Also Read : నా వల్లే ‘భారతీయుడు 2’ ప్లాప్ అయ్యిందని అంటున్నారు.. నన్ను క్షమించండి : ప్రియా భవానీ శంకర్

ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజ ఫ్యాన్స్ ఈ ట్రైలర్‌ తో పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ ఇచ్చిన హైప్ తో కచ్చితంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా.. జగపతి బాబు విలన్ రోల్ ప్లే చేశారు. రవితేజ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

Advertisment
తాజా కథనాలు