Hanuman Voice: ఆ హీరో మాట సాయం చేస్తే.. సినిమా నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ.. మర్యాద రామన్న సినిమాలో సైకిల్.. 'అ' సినిమాలో మొక్క.. ఇప్పుడు హను-మాన్ లో కోతి కోటిగాడు ఈ మూడింటి కామన్ పాయింట్ ఒక్కటే. అది మాస్ మహారాజా రవితేజ వాయిస్. ఈ మూడూ సూపర్ హిట్స్. ఇప్పుడు రవితేజ ‘మాట’సాయం చేస్తే చాలు సినిమా హిట్ అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో పెరిగిపోయింది. By KVD Varma 16 Jan 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ravi Teja Voice Over: ఒక్కోసారి ఎంత పెద్ద సినిమా వచ్చినా.. సినిమాలో అన్ని అంశాలు పెర్ఫెక్ట్ గా ఉన్నా.. వాటన్నిటినీ మించిన స్పెషాలిటీ ఒకటి అందర్నీ ఆకర్షిస్తుంది. సినిమా ఎంత హిట్ అయినా.. హీరో ఎంత సూపర్ గా ఉన్నా.. డైరెక్షన్ అదిరిపోయినా.. ప్రేక్షకులకు వీటితో పాటు ఒక చిన్న అంశం తెగ నచ్చేస్తుంది. ఎవరికీ తెలియకుండానే ఆ సినిమా రేంజ్ పెరగడానికి కారణం అవుతుంది. సరిగ్గా అలాంటి అంశమే ఇప్పుడు హను-మాన్ సినిమాలోనూ ఉంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్.. హీరో ఎలివేషన్స్.. స్టోరీ లైన్.. బీజీఎం ఇన్ని హంగులూ ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేశాయి. అదేసమయంలో మరో అంశం కూడా ప్రేక్షకుల వినోదానికి సైలెంట్ కిక్ ఇచ్చింది. అదే ఒక కోటి అనే కోతి(Hanuman Voice).. అవును.. కోతి చేసే చేష్టలు ఎలానూ వినోదాన్ని పంచుతాయి. పైగా ఇది హనుమాన్ (Hanuman)సినిమా కదా.. మరి కోతి స్పెషల్ ఎట్రాక్షన్ అనుకోవడం ప్రత్యేకంగా ఎందుకూ? అనే డౌట్ వస్తోందా. నిజమే.. కానీ, ఇది మామూలు కోతి కాదు. కోటి! మాట్లాడే కోటి! సినిమా స్టార్టింగ్ లో హీరోను ఛాలెంజ్ చేసి.. హీరోతో దాగుడుమూతలు ఆడి.. సినిమాలో కీలక మలుపులు ఈ కోటి గాడే కారణం. ఒకవిధంగా మనం చెప్పుకుంటున్న ఈ కోటిగాడే సినిమాని నడిపిస్తూ ఉంటాడు. కోటిగాడు నడిపించడంలో విశేషం ఏమీలేదు కానీ, ఈ కోటిగాడి మాటలే అందరికీ తెగ నచ్చేస్తాయి. ఎందుకంటే, ఆ డబ్బింగ్ చెప్పింది మన మాస్ మహారాజ్ రవితేజ. ఎటకారానికి మరో పేరులా ఉండే రవితేజ డైలాగ్ డిక్షన్ తో కోటి గాడు హనుమాన్ సినిమాలో హనుమంతుని ఒక ఆట ఆడేసుకుంటాడు. Also Read: అయ్యో.. తాట తీద్దామంటే.. మడతడిపోయిందిగా.. చిన్నపిల్లలు అయితే, ఈ కోటిగాడి (Hanuman Voice)డైలాగులకు పడి పడీ నవ్వుతూ థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. అన్నట్టు.. మీకూ తెల్సిందే.. రవితేజ ఇదే మొదటిసారి కాదు ఇలా తన వాయిస్ తో ప్రేక్షకులకు కిక్ ఇవ్వడం. గతంలో మర్యాదరామన్న గుర్తుంది కదా.. అందులో సైకిల్ కి వాయిస్ ఇచ్చి.. సునీల్ ని ఒక ఆట ఆడేసుకోవడమే కాదు.. ప్రత్యేకంగా అందరికీ ఆ సైకిల్ తో ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చేసేలా చేశాడు రవితేజ తన వాయిస్ తో. తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమా మహావీరుడు ను కూడా తన వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయాడు రవితేజ. ఇక.. ఆ(awe) సినిమాలో ఒక మొక్కకి తన గొంతు అందించి.. ఆ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాడు మాస్ మహారాజ్. ఇప్పుడు రవితేజ వాయిస్ (Ravi Teja Voice)తో హనుమాన్ లో కోటిగాడి హంగామాకి అందరూ ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలో కూడా రవితేజ గొంతు వినిపిస్తే సినిమా లెవెల్ మారిపోతుంది అనే మాట వినపడుతోంది. అసలే సెంటిమెంట్స్ తో సినిమా ఇండస్ట్రీ ముడివేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ వాయిస్ విక్టరీతో రవితేజ వాయిస్ కోసం డిమాండ్ పెరగడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అన్నట్టు.. హనుమాన్ సినిమాకి రవితేజ చాలా హెల్ప్ చేశాడనే చెప్పుకోవాలి. తన గొంతుతో ఒక రేంజ్ క్రియేషన్ ఇచ్చిన రవితేజ.. తన ఈగిల్ సినిమాని వాయిదా వేసుకోవడం ద్వారా హనుమాన్ థియేటర్ల సమస్యను కొంత వరకూ తగ్గించగలిగాడు. ఏది ఏమైనా ఇప్పుడు రవితేజ మరోసారి తాను చిన్న సినిమాలకు.. మంచి సినిమాలకు పెద్ద అండ అనిపించుకున్నాడు. Watch this interesting video o: #hanuman-movie #raviteja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి