రావణాసురుడు కొత్తగూడెంలోనే ఉన్నాడు

డిసెంబర్‌లోనే తెలంగాణ ఎన్నికలు వస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా హాట్‌ కామెంట్లతో ప్రజల ముందుకు వస్తున్నారు. అయితే బీజేపీలో జితేందర్‌రెడ్డి కామెంట్ దూమారం మర్వక ముందే ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మరో కామెంట్స్‌ చేసి బీఆర్ఎస్‌లో దుమారం రేపుతున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ ఎంట్రీ పరంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రావణాసురుడు కొత్తగూడెంలోనే ఉన్నాడు
New Update

Ravanasura is in Kothagudemరాజకీయ లబ్ది కోసమే..

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నహెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్ మాట్లాడుతూ.. రామాయంలో రావణాసురుడు ఉన్నట్లుగానే కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రామాయణంలో కాదు..

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఉద్దేశించేనా అనే టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా కొత్తగూడెంలో గడాల శ్రీనివాసరావు వివిధ సేవా కార్యక్రమాలతో యాక్టివిటీస్ పెంచేశారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో డీహెచ్ వ్యవహారంపై ఎమ్మెల్యే వనమా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో డీహెచ్ పర్యటన పట్ల ఆయన మండిపడుతున్నారు.

ఫ్లెక్సీల రగడ

నిన్న పాల్వంచలో జరిగిన పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా బీఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాస్‌రావు పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలతోనే సిబ్బంది ఈ ఫ్లెక్సీలను తొలగించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గడాల శ్రీనివాస్‌రావు చేసిన రావణాసుర కామెంట్స్ దుమారంగా మారాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe