Telangana News: ఖమ్మం జిల్లాలో దారుణం.. గురుకుల విద్యార్థులను ఎలుకలు కొరికిన వైనం.. వివరాలివే! తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో వరసగా ఏదో ఒక్క ఘటన జరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం మర్వకముందే ఖమ్మంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటంతో.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు By Vijaya Nimma 27 Sep 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి ఖమ్మం జిల్లా వైరాలో దారుణం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. మంచి చదువులు చదివి.. ఉన్నత స్థాయికి చేరుకుంటారని పిల్లల తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివించాలంటే భయం వేస్తుంటున్నారు తల్లిదండ్రులు. వరగా జరుగుతున్న సంఘటనలు చూసి విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. తాజాగా ఓ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల వసతి గృహంలో ఎలుకల కలకలం సృష్టించాయి. నిద్రిస్తున్న పదిమంది బాలికలను మూడురోజుల క్రితం ఎలుకలు కరిచాయి. తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా సిబ్బంది ఇవ్వటం లేదు. రోజుకు ముగ్గురు చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను లోనికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. బాలికల వసతి గృహంలోకి అనుమతించమంటూ సమాధానం చెబుతున్నారు. విషయం బయటికి రావడంతో బాధిత బాలికలను వసతిగృహంలోనే ఉంచి చికిత్స తీసుకుంటున్నారు. వసతిగృహం సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Your browser does not support the video tag. కామారెడ్డి జిల్లా ఓ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి టైంలో వసతి గదుల్లో నిద్రిస్తుండగా ఎలుకలు కొరకడంతో విద్యార్ధినులకు గాయాలయ్యాయి. ఈ ఘటన దోమకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. ఆగస్టు 28న సోమవారం రాత్రి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. దీంతో ఆ బాలికలకు చిన్న గాయం అయింది. గాయపడిన బాలికలను దోమకొండ సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు పరీక్షించి ఇంజక్షన్లు వేశారు వైద్యులు. అయితే గురుకుల పాఠశాలలో రాత్రిపూట ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కాళ్లు, చేతులను కొరుకుతున్నాయని పలువురు విద్యార్థినులు తెలిపారు. ప్రభుత్వం అధికారులు స్పందించి ఎలుకల బెడద తొలగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి.. గురుకుల పాఠశాలల పరిస్థితి మెరుగుపరచవల్సిందిగా విద్యార్ధుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. Your browser does not support the video tag. హైదరాబాద్‌లోని గురుకులంలో పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్‌లో గింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టి పూజలు చేశారు. అయితే వినాయక విగ్రహం దగ్గర పెట్టిన దీపం అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. హాస్టల్ గదిలో వినాయకుడిని ఏర్పాటు చేసి.. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర కట్టారు. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. నీరజ్‌తో పాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఇద్దరు ఉస్మానియా అస్పత్రితో చికిత్స తీసుకున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ గురుకులంలో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు #khammam #rattle #vaira #gurukula-girls-hostel #ten-girls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి