Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు!

ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డ్ స్వైప్ చేయగానే లబ్ది దారుడి వివరాలు డిస్‌ప్లేలో కనిపించేలా రూపొందించనుంది. ఈ పద్ధతితో రేషన్ పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు!
New Update

Telangana Ration Cards: రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ (Revanth Govt) విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తెల్ల పేపర్‌ పద్ధతికి స్వస్తి పలికి.. స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొత్త కార్డులు స్వైప్ కార్డుల తరహాలో రూపొందిచనుండగా షాపింగ్ చేసినంత సులభంగానే కార్డు స్వైప్ చేసి రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం.

మానిటర్లో డిస్ప్లేలో లబ్దిదారుడి వివరాలు..
ఈ మేరకు కొత్త రేషన్ కార్డుకు చిప్ అమర్చి, స్వైప్ చేయగానే అది యాక్టివేట్ అయ్యేలా కార్డును డిజైన్ చేయనున్నారు. కార్డు స్వైప్ చేయగానే రేషన్ కార్డు లబ్దిదారుడికి సంబంధించిన వివరాలు మానిటర్లో డిస్ప్లే అయ్యేలా తయారు చేస్తున్నారు. ఈ పద్ధతితో రేషన్లో జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం హర్యానాలో సక్సెస్ అయింది. యూపీలోనూ బార్ కోడ్ తరహాలో అమల్లో ఉంది. ఒడిశాలోనూ ఏటీఎం తరహాలోనే రేషన్ కార్డును ప్రవేశపెట్టేలా అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఒడిశాలోనూ గ్రెయిన్ ఏటీఎంల పేరుతో కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందించబోతున్నారు. వీటన్నింటి పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్..  కొత్త కార్డుల జారీ కోసం ఇటీవలే ఉత్తమ్ కుమార్ చైర్మన్గా ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశంలో చిప్తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్వేర్ నిపుణులతో చర్చించింది. కొత్త రేషన్ కార్డులను స్వైప్ కార్డుల తరహాలో తీసుకురావొచ్చని సాఫ్ట్వేర్ నిపుణుల బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసిందని, దీంతో ప్రభుత్వం మరింత వేగంగా ఈ ప్రక్రియను మొదలుపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Samantha : ఆ డైరెక్టర్ తో సమంత డేటింగ్..?

కొత్త రేషన్ కార్డుల కోసం  లక్షలాది మంది ఎదురుచూపు..
మరోవైపు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదరుచూస్తున్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కొత్తగా పెళ్లైన జంటలు ఉమ్మడి ఫ్యామిలీ నుంచి విడిపోయి రేషన్ లబ్ది పొందలేకపోతున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 2021లో కొత్త కార్డుల ప్రక్రియ తెరపైకి రాగా అర్హతగల వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ ఆ ప్రక్రియ దరఖాస్తుల వరకే పరిమితమైంది. అయితే ఇటీవల ప్రజా పాలన పేరుతో రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా కొత్తగా పంపిణీ చేసే తెల్లరేషన్ కార్డుల్లో కొన్ని నింబంధనలు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నవారి వార్షిక ఆదాయం 2 లక్షలు, మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాలుగా ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

#telangana-ration-cards #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి