Ration Card: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డు రూల్స్ ఇవే!

రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ ఇచ్చింది. పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఆదాయం మించిన వారు అర్హులు కారని స్పష్టం చేసింది.

New Update
Ration Card: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డు రూల్స్ ఇవే!

New Ration Cards in Telangana: కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధివిధానాలపై రేవంత్ సర్కార్ (Revanth Government) కీలక ప్రకటన జారీ చేసింది. పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. రేషన్ కార్డు అర్హతకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు మించిన వారు అర్హులు కారని పేర్కొంది. అలాగే వ్యవసాయ భూములు మాగాణి 3.5 ఎకరాలు, చెలక రూ.7.5 ఎకరాలున్న వారికి రేషన్ కార్డు కటాఫ్ పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇక రెండు రాష్ట్రాల్లో రేషన్‌ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

తెల్ల రేషన్ కార్డుల కోసం ఉప సంఘం..
ఈ మేరకు శనివారం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వేసిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై తెల్ల రేషన్ కార్డు మంజూరీ పై నిశితంగా చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి దామోదర రాజ నర్సింహా, రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.యస్ చౌహన్, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ఉండాలనే ప్రతిపాదన ఉపసంఘం ముందుకు వచ్చిందన్నారు.

ప్రతిపక్షం నుంచి సలహాలు, సూచనలు..
ఇక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. డాక్టర్ ఎన్.సి.సక్షేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్‌, ఏలేటి

వలస దారులకు ఒకటే ఆప్షన్.. 
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందన్నారు. అలాంటి వారికి ఒక్కచోటనే అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉప సంఘం చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో అదనపు సభ్యులను చేర్చాలంటూ వచ్చిన దరఖాస్తులు 11 లక్షల 33 వేల 881 ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ మొత్తం మంజూరికి రాష్ట్ర ప్రభుత్వం 956.04 కోట్లు ఖర్చు చేయబోతుందన్నారు.

Advertisment
తాజా కథనాలు