ఘోరం.. ఎలుక కొరకడంతో శిశువు మృతి

నాగర్‌ కర్నూల్‌లో దారుణం జరిగింది. ఎలుక కొరకడంతో నెలలు నిండని శిశువు ఉసురు కోల్పోయాడు. పట్టణ పరిధిలోని నాగనూల్‌లో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులు, కుటుంబీకులకు తీవ్ర విషాదం మిగిల్చింది.

New Update
ఘోరం.. ఎలుక కొరకడంతో శిశువు మృతి

Nagarkurnool : నాగర్‌ కర్నూల్‌(Nagarkurnool) లో దారుణం జరిగింది. ఎలుక(Rat) కొరకడంతో నెలలు నిండని శిశువు ఉసురు కోల్పోయాడు. పట్టణ పరిధిలోని నాగనూల్‌లో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులు, కుటుంబీకులకు తీవ్ర విషాదం మిగిల్చింది. నాగనూల్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ కళకు పెద్ద కార్పాములకు చెందిన శివతో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 40 రోజుల క్రితం ఓ మగ శిశువు పుట్టాడు. అయితే, తల్లిగారింటి వద్ద ఉన్న లక్ష్మీ కళ పిల్లాడిని ఇంట్లో ఉంచి బయట పనులు చూసుకుంటుండగా, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ, ఓ ఎలుక ఆ చిన్నారి ముక్కు కొరికింది. దీంతో ఆ చిట్టి ప్రాణం విలవిల్లాడింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ గజగజ.. సింగిల్ డిజిట్‎కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

గమనించిన తల్లి తీవ్ర ఆందోళనకు లోనైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే స్థానిక జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నీలోఫర్ కు రెఫర్ చేశారు. నిలోఫర్ లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం శిశువు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకొంది. బిడ్డను పడుకోబెట్టి ఇలా వెళ్లి అలా వచ్చే లోపే ఘోరం జరిగిపోయిందంటూ తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు