Rashmika: ఆ స్టార్‌ హీరోతో లిప్‌ లాక్‌..నెట్టింట్లో వైరల్..!!

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక లిప్ లాక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'యానిమల్' మూవీ దాదాపు ఐదు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతోంది.

New Update
Rashmika: ఆ స్టార్‌ హీరోతో లిప్‌ లాక్‌..నెట్టింట్లో వైరల్..!!

Animal Movie Poster: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందాన(Rashmika Mandanna) లిప్ లాక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'యానిమల్' మూవీ దాదాపు ఐదు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతోంది. పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 1న యానిమల్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన యానిమల్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

publive-image

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో రష్మిక కలిసి నటించిన 'యానిమల్' పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో రష్మిక, రణబీర్ కపూర్ ల అధరచుంబన సన్నివేశాన్ని పోస్టర్ గా వదిలారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. రేపు ఈ చిత్రానికి చెందిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో రణ్‌బీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించాడు.

publive-image

'పుష్ప' సినిమాతో నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందాన..ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వరుస ఆఫర్లతో దుసుకుపోతుంది.  మరోవైపు బాలీవుడ్ కు తగ్గట్టుగానే అన్నిటికీ ఓకే చెప్పేస్తోంది. రొమాంటిక్ సీన్లలో నటించేందుకు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు.

 Also Read: అందుకోసం రణబీర్ కపూర్ షాకింగ్ నిర్ణయం..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు