/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rashmika-jpg.webp)
Rashmika Mandanna: రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. టాలీవుడ్ లో పుష్ప మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది. త్వరలో రణబీర్ తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో (Animal Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు ‘పుష్ప2’ (Pushpa 2) లోనూ నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు మరో 4 సినిమాల్లోనూ నటిస్తోంది.
తాజాగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు (Rashmika Mandanna) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్టులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోను చూసి చాలా మంది ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రష్మిక ఇలా ఎక్స్ పోజ్ చేయడం ఏంటి? ఇలా తయారై బయటకు రావడం ఏంటి? అని నెటిజన్లను అనుమానం వ్యక్తం చేశారు.
చివరకు కొంత మంది ఇది ఫేక్ వీడియో అంటూ కామెంట్ పెట్టారు. కానీ, చూడ్డానికి నిజమైన వీడియో లాగానే కనిపించడంతో చాలా మంది రియల్ వీడియో అని భ్రమ పడ్డారు. చివరకు అభిషేక్ అనే జర్నలిస్టు ఇది ఫేక్ వీడియో అంటూ ఆధారాలతో సహా ప్రూవ్ చేశారు. ఈ వీడియోలో ఉన్నది అసలు రష్మిక కాదని ఆయన తేల్చేశారు. ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు సంబంధించినదని వెల్లడించారు. ఆ వీడియోతో పాటు మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జారా వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లు వెల్లడించారు.
The original video is of Zara Patel, a British-Indian girl with 415K followers on Instagram. She uploaded this video on Instagram on 9 October. (2/3) pic.twitter.com/MJwx8OldJU
— Abhishek (@AbhishekSay) November 5, 2023
ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. అయితే, ఈ వీడియోపై ఇంత వరకూ రష్మిక నుండి ఏ మాత్రం రియాక్షన్ లేదు.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023