Rashid Khan : T20ల్లో రషీద్ ఖాన్ సరికొత్త రికార్డు.. 9 సార్లు ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ గా!

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20ల్లో ఏకంగా 9 సార్లు నాలుగేసి వికెట్లు తీసుకున్న తొలి బౌల‌ర్‌ నిలిచాడు. ఇవాళ (జూన్ 25) బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కీల‌క‌మైన నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత అందుకున్నాడు.

New Update
Rashid Khan : T20ల్లో రషీద్ ఖాన్ సరికొత్త రికార్డు.. 9 సార్లు ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ గా!

Rashid Khan Creates New Record In T20 Format : ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. త‌న కెరీర్‌లోనే అరుదైన ఘనతని అందుకున్నాడు. టీ20ల్లో ఏకంగా 9 సార్లు నాలుగేసి వికెట్లు తీసుకున్న తొలి బౌల‌ర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు. ఇవాళ (జూన్ 25) బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రషీద్ కీల‌క‌మైన నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత అందుకున్నాడు.

ర‌షీద్ ఖాన్ త‌ర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఉన్నారు.ష‌కీబ్ 8 సార్లు నాలుగేసి వికెట్లు తీసి సెకెండ్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. ఇతని తర్వాత ఉగాండా బౌల‌ర్ హెన్రీ సెన్యోడా ఏడు సార్లు నాలుగేసి వికెట్లు తీసి మూడ‌వ స్థానంలో ఉన్నాడు. ఇక ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం 8 ర‌న్స్ తేడాతో బంగ్లాపై ఆఫ్ఘ‌నిస్తాన్ గెలిచింది.

Also Read : సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!

ఈ మ్యాచ్ లో స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ నాలుగు ఓవ‌ర్లు వేసి 23 ర‌న్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో వేగంగా 150 వికెట్స్ తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇక బంగ్లా దేశ్ పై సూపర్ విక్టరీ సాధించిన ఆఫ్ఘనిస్థాన్.. జూన్ 27 న సౌత్ ఆఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు