Two Hit And Run Cases In Noida: కారు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు నడపడం.. యాక్సిడెంట్ చేయడం.. కనీసం కారు ఆపకపోవడం.. ఏదో సాధించినట్లు కారులో నుంచి అరవడం.. ఈ మధ్య కాలంలో సిటీల్లో ఎక్కువగా కనిపిస్తున్న దృశ్యాలు. అవతలి ప్రాణాలంటే లెక్కలేదు. ఎవడు పోతే మాకేంటి అన్నట్లు ఉంటున్నారు. ఒక మనిషిని గుద్దుకుంటూ పోతే దాన్ని నేరం అంటారు కానీ.. ఎలైట్ క్లబ్‌లో మెంబర్ అనరు. ఈ విషయాన్ని కొంతమంది డబ్బులున్నవాళ్లు తెలుసుకోవాలంటున్నారు నెటిజన్లు. హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అటు బెంగళూరలోనూ రెక్‌లెస్ డ్రైవింగ్ కేసులు వెలుగుచూస్తుండగా.. ఢిల్లీ, నోయిడా(Noida)లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీపావళి సందర్భంగా జరిగిన రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.
కనీసం కారు ఆపలేదు:
దీపావళి వేడుకల సందర్భంగా గ్రేటర్ నోయిడాలో రెండు ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు జరిగియి. ఈ రెండూ హిట్ అండ్ రన్ కిందకే వస్తాయి. ఈ రెండు ఘటనల్లో మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. మొదటి ఘటన సెక్టార్-119లోని రెసిడెన్షియల్ సొసైటీ వెలుపల రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. వేగంగా వస్తున్న మారుతీ స్విఫ్ట్ కారు టపాసులు పేల్చుతున్న ఎనిమిదేళ్ల బాలికతో సహా ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ కనీసం కారును ఆపలేదు. అలానే పొనిచ్చికుంటూ వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన వారిలో బాలికతో వృద్ధుడు కూడా ఉన్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని సమాచారం.
మరో ఘటన గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 2లోని 7వ అవెన్యూలో జరిగింది. అసలు కారును అడ్డదిడ్డంగా పొనిచ్చాడు డ్రైవర్. వీడియో చూస్తే కావాలనే ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్‌యూవీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ కారు ఆపలేదు.. అలానే అడ్డదిడ్డంగా... వంకరటింకరగా డ్రైవ్ చేసుకుంటూ పోయాడు.
Also Read: ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా.. ఇప్పుడెక్కడున్నారో బ్రో మీరంతా?
WATCH: