రేవంత్ రెడ్డితో పాటు ఆ నాయకులపై ట్రాఫిక్ చలాన్లు ఎంతున్నాయో తెలుసా!

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు చాలామంది పేరుమీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ప్రధాన పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం విశేషం.

రేవంత్ రెడ్డితో పాటు ఆ నాయకులపై ట్రాఫిక్ చలాన్లు ఎంతున్నాయో తెలుసా!
New Update

Trafic rules violation: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యంగా దూసుకెళ్లడం.. ట్రాఫిక్ సిగ్నళ్ల జంపింగ్... ట్రాఫిక్ యాతనను అనుభవించే సగటు మహానగర వాసి నిత్యం ఎక్కడో ఓ చోట చూసే ఘటనలే ఇవన్నీ. ఇందులో వింతేముంది అంటారా! ఎవరో అనామకులైతే ఏమో అనుకోవచ్చు గానీ, పేరున్న పెద్ద నాయకులే ఇలాంటి పనులు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. పైగా, వారి ట్రాఫిక్ చలాన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం విశేషం.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు చాలామంది పేరుమీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రమాదకరంగా వాహనాలను నడపడం, నో పార్కింగ్ లో కార్లు నిలపడం, సిగ్నళ్లు జంప్ చేయడం, నంబర్ ప్లేట్లు సరిగా లేకపోవడం, వాహనాలకు పారదర్శకంగా లేని అద్దాలు వినియోగించడం, స్టాప్ లైన్లు క్రాస్ చేయడం... ఇలా దాదాపు అన్ని రకాల నిబంధనలనూ మన నేతాశ్రీలు ఉల్లంఘించేశారు. నామినేషన్ పత్రాల సమర్పణకు ముందే నాయకులు ఈ బకాయిలను సెటిల్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఇంకా అనేకమంది చలాన్లను పెండింగ్ లోనే ఉంచేశారని తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి; మాజీ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి వి. సునీతారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, బీజేపీ అభ్యర్థి ఎన్. రామచంద్రరావు, ఏఐఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ పేర్ల మీద ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం, రంగారెడ్డి జిల్లాలతో పాటు తమ నియోజకవర్గాలకు వెళ్లే జాతీయ రహదారులపై నాయకుల ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఇదికూడా చదవండి: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్!

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దినేశ్ కుమార్ కులాచారి పేరుమీద అందరికన్నా ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆయన నాలుగు కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల విలువ దాదాపు రూ. 12వేలు. ఈ వాహనాల్లో కొన్ని తనకు సంబంధించిన కంపెనీ సవిత ఇన్ఫ్రా పేరిట నమోదై ఉన్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బీజేపీ నేత ఎన్. రామచంద్రారావుపై వివిధ ఉల్లంఘనల కారణంగా రెండేళ్లుగా రూ. 8,150 చలాన్లు ఉన్నాయి. ఆయనకు చెందిన మరో కారుపై రూ. 1505 చలాన్ ఉంది. అదేవిధంగా బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కార్లపై రూ. 6,500 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ రెండు వాహనాలపై వివిధ ఉల్లంఘనల కారణంగా రూ. 2,200 చలాన్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ కు చెందిన రెండు కార్లపై 2022 నుంచి రూ. 2070, రూ.770 పెండింగ్ లో ఉన్నాయి.

నిబంధనలు ఉల్లంఘించినది ఎవరైనా తాము చలాన్లు విధిస్తామని, వాటిని సకాలంలో చెల్లించి పరిష్కరించుకోవడం వాహన యజమానులుగా ఉన్న వ్యక్తుల బాధ్యత అని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు.

#telangana-elections-2023 #traffic-challans #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe