Weight loss: వేగంగా బరువు తగ్గడం శరీరానికి హానికరం.. అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం! ప్రస్తుతం బరువు తగ్గడం అనేది పెద్ద సవాల్. బరువు తగ్గడానికి షార్ట్‌కట్ మార్గాన్ని అవలంబిచేవారికి ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వేగవంతమైన బరువు తగ్గడం వల్ల అలసట, జుట్టురాలడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 03 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Weight loss: నేటి జీవనశైలిలో బరువు తగ్గడం అనేది పెద్ద సమస్యగా మారింది. మార్కెట్‌లో బరువు తగ్గించే మెడిసిన్, చిట్కాలు, ఫుడ్ వంటి చాలా ఫాలో చేస్తారు. కొందరు వ్యక్తులు బరువు తగ్గడానికి షార్ట్ కట్ మార్గాన్ని అవలంబిస్తారు. కానీ అది వారి ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు అంటున్నారు. చాలా వేగంగా బరువు పెరగడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. బరువు తగ్గడం అంటే సన్నగా ఉండటమే కాదు, ఆరోగ్యంగా కనిపించడం కూడా లక్ష్యమంటున్నారు. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, కండరాలకు చాలా నష్టం కలిగిస్తుంది. బలహీనమైన జీవక్రియతో సమస్యలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగవంతమైన బరువు తగ్గడం శరీరానికి ఏ విధంగా హానికరమో..? అనేక తీవ్రమైన వ్యాధులకుఎలా దారితీస్తుందో ఇప్పుడు కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు వేగంగా తగ్గే ప్రయత్నం చేస్తే కలిగే నష్టాలు: తక్కువ క్యాలరీలను తీసుకోవడం ద్వారా.. బరువు వేగంగా తగ్గుతారు. అదే సమయంలో ఇది కండరాలకు చాలా నష్టం కలిగిస్తుంది. దీని వల్ల కండరాలు బలహీనపడటం మొదలవుతుంది. శరీరం నుంచి నీటి నష్టం కూడా మొదలవుతుంది. అంతేకాకుండా బలహీనత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వేగవంతమైన బరువు తగ్గడం వల్ల అలసట, జుట్టు రాలడం, రక్తహీనత, బలహీనమైన ఎముకలు, బలహీనమైన రోగనిరోధక శక్తి, పనితీరుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వేగంగా బరువు కోల్పోయే ప్రక్రియలో.. అధిక అలసట, కండరాల తిమ్మిరి, మైకము, మలబద్ధకం, చలి, చిరాకు వంటి సమస్యలు శరీరానికి అనేక హాని చేస్తాయని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఈ మెడిసన్ ప్రత్యేకంగా వృద్ధుల కోసమే.. ఇది గుండె జబ్బులతో పాటు అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది! #weight-loss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి