అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్.! స్కూల్ విద్యార్థినికే తాళి కట్టి పెళ్లి అయ్యిందంటూ అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమగోదావరి యండగండిలో చోటుచేసుకుంది. అయితే, ఇంతకు ముందే సోమరాజుకు పెళ్లి అయింది. కాగా, కుటుంబ కలహాలతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. By Jyoshna Sappogula 23 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Teacher Suspended: స్కూల్ విద్యార్థినికే తాళి కట్టి పెళ్లి అయ్యిందంటూ అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సి బడిపంతుడు.. బుద్ధి తప్పి ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. కీచకుడిలా ప్రవర్తించారు. తాను పాఠాలు చెబుతున్న స్కూల్ విద్యార్థినికే తాళి కట్టాడు ఉపాధ్యాయుడు. పెళ్లి అయ్యిందంటూ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత తనకేమీ తెలియనట్లు డ్రామాలాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు.. ఉండి మండలం యండగండి గ్రామంలోని పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడే తాళి కట్టి తామిద్దరికీ పెళ్లి అయ్యిందని చెప్పాడు. Also Read: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు..! అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి.. అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆపై కుటుంబ సభ్యులను తెలియకుండా ఉంచాలంటూ నమ్మించి.. బాలికను ఇంటికి పంపించాడు. ఆ తరువాత ముఖం చాటేశాడు. అయితే, జరిగిన మోసాన్ని గుర్తించిన బాలిక.. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే, సోమరాజుకు అప్పటికే పెళ్లై భార్య, ఒక పాప ఉందని షాకింగ్ విషయం తెలిసింది. కాగా, కుటుంబ కలహాలతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో బాధిత యువతి.. తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో ఉపాధ్యాయుడుపై వేటు వేశారు విద్యాశాఖ అధికారులు. అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. #andhra-pradesh #ap-crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి