Delhi: ఢిల్లీలో దుమారం రేపుతున్న మైనర్ బాలిక అత్యాచార ఘటన

ఢిల్లీలో ఓ మైనర్‌ బాలిక అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారే నెలల తరబడి ఆమెపై పైశాచికంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌ స్వాతి మలివాల్‌.

New Update
Delhi: ఢిల్లీలో దుమారం రేపుతున్న మైనర్ బాలిక అత్యాచార ఘటన

Delhi minor rape case:
నేలపైనే నిద్రించిన స్వాతి మలివాల్.. 

ఢిల్లీలో ఓ మైనర్‌ బాలిక అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారే నెలల తరబడి ఆమెపై పైశాచికంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్(DCW) చీఫ్‌ స్వాతి మలివాల్‌(Swati Maliwal). బాధితురాలిని, ఆమె తల్లిని కలిసేందుకు అనుమతించాలంటూ అక్కడే బైఠాయించారు. రాత్రంతా ఆస్పత్రి ఎదుటే నేలపైనే నిద్రించారు. సోమవారం నుంచి ఇక్కడే ఆందోళన చేస్తున్నా లోపలికి అనుమతించడం లేదని పోలీసులపై ఫైరయ్యారు స్వాతి మలివాల్‌. బాధితురాలిని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారామె.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

2021లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను, ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. 51 ఏళ్ల ప్రేమోదయ్ ఖాఖా(Premoday Khakha), ఆయన భార్య సీమారాణిలపై ఈ నెల 13న పోక్సో చట్టం (POCSO ACT) కింద కేసు నమోదు చేశారు. బురారీ ప్రాంతంలోని శక్తి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిందితుడు..స్నేహితుని కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020లో బాధితురాలి తండ్రి మరణించడంతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. 2020 అక్టోబర్‌ నుంచి 2021 జనవరి వరకు ఆమెపై చాలా సార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి.

అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు..

పద్నాలుగేళ్ల ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో.. ఆయన భార్య అబార్షన్‌ మాత్రలిచ్చింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేరింది. అక్కడ కౌన్సిలర్‌కు తన బాధను వివరించడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రేమోదయ్‌ను అసిస్టెంట్ డైరెక్టర్ పదవి నుంచి సస్పెండ్ చేసింది కేజ్రీవాల్‌ ప్రభుత్వం. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ కమిషనర్‌ ఫర్‌ ఉమెన్‌ DCW చీఫ్‌ స్వాతి మలివాల్‌ ఆ అధికారిని వెంటనే అరెస్టు చేయాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఖాఖాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరినీ ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్నారు.

Also Read: చంద్రయాన్ ల్యాండింగ్ ఆ 17 నిమిషాల 21 సెకన్లు ఎందుకంత కీలకం..!!

Advertisment