Ransomware Attack : టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌ పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి.. 300 బ్యాంకులపై ప్రభావం!

భారత్‌ వ్యాప్తంగా పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానం అందించే టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌ పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. దీంతో భారత్‌ లోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

New Update
Bank Server Hacking : బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌.. 5 రోజుల్లో 16 కోట్లు విత్ డ్రా!

Small Banks : భారత్‌ (India) వ్యాప్తంగా పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానం అందించే టెక్నాలజీ సర్వీస్‌ (Technology Services) ప్రొవైడర్‌ పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. దీంతో భారత్‌ లోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

భారత్‌ లోని కొన్ని చిన్న బ్యాంకులకు బ్యాంకింగ్‌ టెక్నాలజీ సిస్టమ్‌ లు అందించే సి-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ (C-Edge Technologies) పై దాడి జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ కానీ, ఆర్బీఐ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆష్‌ ఇండియా ర్యాన్సమ్‌ వేర్‌ దాడి (Ransomware Attack) ఘటన తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. కోపరేటివ్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ పై ర్యాన్సమ్‌ వేర్‌ దాడి ఘటనతో కొన్ని చెల్లింపు వ్యవస్థల పై ప్రభావం పడినట్లు ఒక పబ్లిక్‌ అడ్వైజరీ విడుదల చేసింది.

మిగతా చెల్లింపుల వ్యవస్థ లపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు రిటైల్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌ తో సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ను తాత్కాలికంగా వేరు చేసినట్లు తెలిపింది.

Also read: ఏపీలో 96 మంది డీఎస్పీలపై బదిలీ వేటు!

Advertisment
తాజా కథనాలు