Ranganayaka Sagar Trip: ఆదివారం వస్తుందంటే ఆ ఆనందమే వేరు. కొన్ని సంస్థలకు మినహా చాలా మందికి సండే హాలీడే. ఇంట్లో పిల్లలకు కూడా స్కూల్ ఉండదు. దీంతో ఎటైనా వెళ్లాలనిపించడం సహజం. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు సండే అంటే ఇంట్రెస్టు ఎక్కువ. ఎక్కువ అయితే చూసిన ప్రదేశాలే చూడడం కాస్త బోర్ అనిపిస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో భాగ్యనగార ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ చుట్టూ పక్కలా ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి ఆరా తీస్తున్నారు. ఇలా సండే రాగానే అలా అక్కడ వాలిపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం.. సాయంత్రం చికటీ పడే వరకు అక్కడే ఎంజాయ్ చేయడం.. సిటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బయటే ఏదో ఒకటి తీనేసి ఇంటికి వెళ్లడం చాలామంది చేసే పని. మీరు అలాంటి ప్లాన్ ఫాలో అయ్యేవారైతే ఈ ఆర్టికల్ మీ కోసమే. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఓ టూరిస్ట్ స్పాట్ గురించి తెలుసుకోండి.
అందమే ఆనందం:
రంగనాయక సాగర్ రిజర్వాయర్, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్ట్‌కు ఆకర్షణీయమైన ఆభరణం. సిద్దిపేట పట్టణానికి సమీపంలోని ప్రశాంతమైన జలాలు ఇక్కడ ఉన్నాయి. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని పొలాలతో ప్రయాణికులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. సందర్శకులు దాని శాశ్వత నీటి మట్టాలు, సుందరమైన పరిసరాలు, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్ కోసం ఇక్కడికి వస్తుంటారు. రిజర్వాయర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ద్వీపం ఉంది. ద్వీపం పైన హరిత రిసార్ట్ ఉంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ప్రకృతి అందాల కలయికతో, తెలంగాణ నడిబొడ్డున శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టిస్తోంది. దాని తీరాలను అన్వేషించడానికి ప్రయాణికులను ఆహ్వానిస్తుంది.
ఇది ఎక్కడ ఉంది?
రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ సైట్ సిద్దిపేట పట్టణానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చు.
Also Read: నైట్ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది