Rakshasa Raja : రానా దగ్గుబాటి(Rana Daggubati) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా రంగంలో నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు పొందారు. వివిధ భాషల్లో ప్రధాన పాత్రల నుంచి సహాయ నటుడి పాత్రల వరకు విభిన్నమైన పాత్రల్లో కనిపించి పాన్ ఇండియా స్థాయిలో పేరు పొందిన భారతీయ నటుల్లో రానా ఒకరని చెప్పొచ్చు.
రానా 2010 లో శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తొలి సారి హీరోగా పరిచయమయ్యారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సినిమాలో రానా నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంశలు వచ్చాయి. మొదటి సినిమాకే రానా బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్ గా ఫిలిం ఫెయిర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రానా "దమ్ మారో దమ్" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రానా పాత్రకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కెరీర్ మొదట్లోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రానా ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురు వంటి సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. రానా నటన కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వలేదు హిందీ, తమిళ్ సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు.
2015 లో విడుదలైన బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో విలన్ గా నటించారు. ఈ సినిమా రానా కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి, రుద్రమదేవి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. నటుడిగా మాత్రమే కాదు VFX ప్రొడ్యూసర్ గా, నిర్మాతగా ఘాజి, సైనికుడు, బొమ్మలాట, కేరాఫ్ కంచెర పాలెం వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సాహించారు రానా. ప్రస్తుతం రానా ప్రభాస్ నటిస్తున్న కల్కీ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను చేపట్టినట్లు తెలుస్తోంది.
బాహుబలి సినిమాలో భల్లాలదేవగా విలనిజం చూపించిన రానా.. మరో సారి రాక్షస రాజు(Rakshasa Raja) హిరణ్యకసుపుడు పాత్రలో కనిపించబోతున్నారు.
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో విడుదలైన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా గ్రే షేడ్ పాత్రలో కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వీళిద్దరి కాంబోలో మరో సినిమా చేయబోతున్నారు. నేడు రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'రాక్షస రాజా' టైటిల్ తో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ విషయాన్నీ రానా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
Also Read: Tamil Hero Vijay Kanth: ఎలా ఉండే విజయకాంత్..ఎలా ఐపోయాడో చూడండి.. కన్నీళ్లు ఆగవు