Jai Hanuman: హనుమంతుడిగా రానా దగ్గుబాటి.. వైరలవుతున్న న్యూస్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. అయితే ఈ మూవీలో హనుమంతుడిగా రానా దగ్గుబాటి కనిపించబోతున్నారని ఓ న్యూస్ వైరలవుతుంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Jai Hanuman: హనుమంతుడిగా రానా దగ్గుబాటి.. వైరలవుతున్న న్యూస్
New Update

Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో విడుదలైన లేటెస్ట్ చిత్రం హనుమాన్. 2023 డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ వద్ద రికార్డు వసూళ్లతో దుమ్ము రేపుతోంది. పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీలో సెన్సేషన్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే హనుమాన్ ముగింపు లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న చిత్రం జై హనుమాన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్దమైనట్లు.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. పార్ట్ 1 మంచి రెస్పాన్స్ పొందడంతో సీక్వెల్ పై మరింత అంచనాలు పెరిగాయి. హనుమాన్ మూవీలో శ్రీరాముడికి ఇచ్చిన మాట కోసం హనుమంతుడు ఏం చేశారు అనే కథాంశంతో సీక్వెల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Prabhas: రాజాసాబ్ నుంచి సూపర్ అప్డేట్.. రిలీజ్ అప్పుడే

publive-image

హనుమంతుడిగా రానా దగ్గుబాటి

అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోయేది ఎవరని సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా హనుమంతుడిగా భల్లాల దేవుడు రానా దగ్గుబాటి నటిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో కనిపిస్తారని చెప్పడం.. అలాగే హనుమాన్ చివరిలో కనిపించే కళ్ళు రానా లానే ఉండడంతో.. అభిమానులు కన్ఫమ్ హనుమంతుడి పాత్రలో కనిపించేది రానానే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రానా భాగం కాబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.

Also Read: Chaitanya post: విడాకుల పై నిహారిక కామెంట్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త

#jai-hanuman-movie #rana-daggubati-as-hanuman
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe