Tollywood: ఇంటి నుంచి పారిపోయి.. స్టార్‌గా మారిన తెలుగమ్మాయి!

14 ఏళ్ల వయసులో అత్తింటి వేధింపులు తట్టుకోలేక.. ఇంటి నుంచి పారిపోయి.సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ.. హీరోయిన్లకు మించిన క్రేజ్ సంపాదించింది. చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఆ నటి ఎవరో చూసేయండి!

Tollywood: ఇంటి నుంచి పారిపోయి.. స్టార్‌గా మారిన తెలుగమ్మాయి!
New Update

Silk Smitha: ఆమె ఎవరో కాదు.. సిల్క్ స్మిత. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన నటి. ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ పొందిన ఈ నటి.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు. సిల్క్ స్మిత ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వలి గ్రామంలో జన్మించారు. సిల్క్ స్మిత అసలు పేరు..విజయలక్ష్మి (Vijaya Laxmi). చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడేది. ఆ కారణంతో నాలుగు తరగతిలోనే సిల్క్ స్మిత చదువు మానేయాల్సి వచ్చింది. అప్పుడామె వయసు పదేళ్లు మాత్రమే. స్కూల్ మానేసిన తర్వాత సిల్క్ స్మిత ఇంటి పనుల్లో తల్లికి సాయం చేయడం మొదలుపెట్టింది.విచిత్రమేమిటంటే కొన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులు.. ఆమెను అడగకుండానే అపరిచితుడితో వివాహం జరిపించారు.

publive-image

సిల్క్ స్మితకు 14 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఆమె జీవితం దుర్భరంగా మారింది. భర్తతో పాటు అత్తామామలు నిత్యం వేధించేవారు.అత్తింటి వేధింపులు తాళలేక ఇంటి నుంచి పారిపోయి డబ్బు సంపాదన కోసం సినీ ప్రపంచాన్ని ఆశ్రయించారు సిల్క్ స్మిత. మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత తన పేరును మార్చుకుని విజయలక్ష్మి నుంచి సిల్క్ స్మితగా మారారు.1979లో ‘వందికకారం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు సిల్క్ స్మిత. ఆ తర్వాత 80వ దశకం నుంచి 90వ దశకం వరకు తెలుగుతో పాటు మలయాళం, తమిళం సినిమాల్లో దాదాపు దశాబ్దంన్నర పాటు ఎన్నో సినిమాలు చేశారు. టాప్ డ్యాన్సర్ గా రాణించి అందరినీ ఆకర్షించారు.

Silk Smitha

స్మిత 1979-96 మధ్య కాలంలో 400కు పైగా చిత్రాల్లో నటించారు సిల్క్ స్మిత. ఆమె డాన్స్ ఎంత ఫేమస్ అంటే.. లీడ్ రోల్ కాకపోయినా.. సినిమా పోస్టర్లలో ఆమె ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. 80వ దశకంలో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్లో ఖచ్చితంగా సిల్మ్ స్మిత పాటలు పెట్టేవారు. ఆమె ఐటమ్ సాంగ్స్ వల్లే అప్పట్లో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి.సిల్క్ స్మిత తన కష్టసుఖాలను ఎవరితోనూ పెద్దగా పంచుకునే వారు కాదట. అంతేకాదు ముక్కుసూటిగానూ మాట్లాడేవారని అంటారు. సెట్స్‌కి సమయానికి వెళ్లేవారు. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఆమెలో ఎంతో ఉండేది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ తన పాత స్నేహితుల కోసం సమయం కేటాయించేవారు.పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఫెయిల్యూర్ రిలేషన్ షిప్స్ తర్వాత సిల్క్ స్మితకి నటనపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. సినీ పరిశ్రమలో పతనం తర్వాత.. ఆమె ఒంటరయిపోయారు. బంధువులు, స్నేహితులు ఎవరూ ఆమెను పట్టించుకోలేదట.ఆ క్రమంలోనే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వార్తలొచ్చాయి. పోస్టుమార్టం రిపోర్టులో అతిగా మద్యం సేవించడం వల్లే ఆమె మృతి చెందిందని తేలింది. ఐతే ఇప్పటికీ ఆమె మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి.

Silk Smitha

Also Read: తండ్రైన మంచు మనోజ్.. ప్రేమగా ‘MM పులి’ అని పిలుస్తామని మంచు లక్ష్మి ట్వీట్..!

#tollywood #silk-smitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe