Cricket: పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రమీజ్ రాజా!

పాకిస్థాన్  పేసర్ మహ్మద్ అమీర్‌ను పీసీబీ రిటైర్మెంట్ నుంచి వెనక్కి తీసుకురావటంపై  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్సింగ్ కు పాల్పడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి స్థానంలో తన కొడుకు ఉన్న ఉపేక్షించేవాడిని కాదని..రమీజ్ రాజా అన్నారు.

New Update
Cricket:  పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రమీజ్ రాజా!
Ramiz Raja: పాకిస్థాన్  పేసర్ మహ్మద్ అమీర్‌ను పీసీబీ రిటైర్మెంట్ నుంచి వెనక్కి తీసుకురావటంపై  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టులో ఎంపికకు తాను అందుబాటులో ఉన్నట్లు అమీర్ ప్రకటించాడు. 31 ఏళ్ల మహ్మద్ అమీర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన అతనిని  పాకిస్థాన్ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై రమీజ్ రాజా మండిపడ్డాడు. అమీర్ చేసిన నీచమైన పనిని క్షమించేది లేదని రాజా చెప్పారు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా ఉన్న రమీజ్, తన కుమారుడు ఫిక్సింగ్‌లో పాల్గొన్నా , క్రికెట్‌కు అవమానం కలిగించే ఏదైనా చర్యకు పాల్పడినట్లు తేలితే, తాను కూడా క్షమించనని చెప్పాడు.
ఒక పాకిస్థానీ ఛానెల్‌తో సంభాషణలో మహ్మద్ అమీర్ గురించి రమీజ్ రాజాను ఒక ప్రశ్న అడిగినప్పుడు, 'మహ్మద్ అమీర్‌పై నా నమ్మకం ఏమిటంటే, అతన్ని మళ్లీ పాకిస్తాన్ తరపున ఆడటానికి అనుమతించకూడదు. అయితే, క్రికెట్‌లో నైతిక ప్రమాణాలను మెరుగుపరచడం నా బాధ్యత కాదు, కానీ అతను ఫిక్సింగ్ చేసినప్పుడు, నేను కూడా దానిని అనుభవించానని సమాజం, అభిమానులు అర్థం చేసుకోవాలి. నేను ఆ సమయంలో లార్డ్స్‌లో వ్యాఖ్యానం చేస్తున్నాను. నన్ను అసహించుకున్న విషయాలు ఇప్పటికి నా మెదడులో ఉన్నాయి. ఎందుకంటే ఆ టీమ్‌తో నాకు కూడా అనునుబంధం ఉందని జనాలు అనుకున్నారు.
2010లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మహ్మద్ అసిఫ్, సల్మాన్ బట్‌లతో పాటు మహ్మద్ అమీర్ కూడా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఆ తర్వాత అమీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు. అతను చాలా రాత్రులు కటకటాల వెనుక గడపవలసి వచ్చింది. శిక్ష అనుభవించిన తర్వాత మరియు నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత, అమీర్ 2016లో క్రికెట్‌కు తిరిగి వచ్చాడు, కానీ అప్పటి నుండి అతను విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా కళంకితమైతే ఔట్ అంటున్నాడు రాజా. నా దృష్టిలో అతను క్షమాపణ పొందలేడు.
31 ఏళ్ల మహ్మద్ ఆమిర్ 2019లో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఒక సంవత్సరం తర్వాత, అంటే 2010లో, అతను వైట్ బాల్ నుండి కూడా రిటైర్ అయ్యాడు. 3 సంవత్సరాల రిటైర్మెంట్ తర్వాత, అమీర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించాడు. కొత్త పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో సమావేశమైన తర్వాత, అమీర్ టీ20 ప్రపంచకప్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది.
Advertisment
Advertisment
తాజా కథనాలు